
ప్రభుత్వ ఉద్యోగాలకు కాంపిటిషన్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రైవేట్ సెక్టార్ లో లే ఆఫ్స్ కొనసాగుతుండడంతో గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. మరి మీరు కూడా మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఇదే మంచి ఛాన్స్. కేంద్ర ప్రభుత్వ సంస్థ RITES లిమిటెడ్లో అసిస్టెంట్ మేనేజర్ కావచ్చు. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఈ నవరత్న కంపెనీ మల్టిపుల్ ఇంజనీరింగ్ ఎక్స్ పర్ట్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Also Read:Hyderabad Police : డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త మోసాలు.. పోలీసుల కీలక సూచనలు..
సివిల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ & టెలికమ్యూనికేషన్, మెకానికల్, మెటలర్జికల్, కెమికల్, ఫార్మా, ఫుడ్ టెక్నాలజీ వంటి వాటిల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / పవర్ సప్లై / ఎలక్ట్రికల్ / మెకానికల్ ఇంజనీరింగ్ / మెటలర్జికల్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ ఇంజనీరింగ్ / ఫుడ్ టెక్నాలజీ / ఫార్మసీ మొదలైన వాటిలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు గరిష్టంగా 40 సంవత్సరాల వరకు ఉండొచ్చు.
Also Read:Tata Sierra Price: సెల్టోస్, క్రేటా, విక్టోరిస్తో పోల్చితే టాటా సియెర్రా ధర ఎక్కువా, తక్కువా.?
ఈ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 42,478 శాలరీ లభిస్తుంది. జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.600 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. EWS/SC/ST/PWD అభ్యర్థులకు రూ. 300గా నిర్ణయించారు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 26 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ విధానంలో డిసెంబర్ 25 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష జనవరి 11, 2026న నిర్వహించనున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.