Tiruvuru MLA: ఎమ్మెల్యే కొలికిపూడి కీలక వ్యాఖ్యలు.. అలా అనుకున్న వారిని తొక్కి నార తీస్తా..

Tiruvuru Mla Kolikapudi Srinivasa Rao Made Strong Remarks Again

Tiruvuru MLA controversy: తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజక వర్గంలో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తిరువూరు నియోజకవర్గం బయట కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారు, ఈ విషయం తిరువూరులో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసని పేర్కొన్నారు. ఇక, ఎన్నికల సమయంలో టీడీపీకీ వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు కూడా ఎమ్మెల్యే అంటే నాలాగే ఉండాలి అని ఇప్పుడు అంటున్నారు. తాను చంద్రబాబు ఆశీస్సులతో మాత్రమే ఎమ్మెల్యే అయ్యానని వేరే వారి వాళ్ల కాదు అని కొలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

Read Also: Rainbow Meadows : ఏకంగా ప్రభుత్వ భూమిలో విల్లాలు.. రెయిన్‌బో మెడోస్ స్కామ్‌..!

అయితే, కొంతమంది సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల మాదిరిగా ఎమ్మెల్యేని కూడా కింద కూర్చో పెట్టాలని అనుకుంటున్నారు అలా అనుకుంటున్నా వారిని తొక్కి నార తీస్తాను అని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తా.. రాజ్యాంం ప్రకారం పని చేస్తాను అని చెప్పుకొచ్చారు. రాజ్యాంగాన్ని మాత్రమే గౌరవించిన వారిని మాత్రమే గౌరవిస్తాను అని కొలికపూడి పేర్కొన్నారు.