
Lizards: బల్లులు ఏ మాత్రం హానికరం కావు, హాని తలపెట్టవు. కానీ వాటిని చూస్తే చాలా మంది భయపడుతుంటారు. నిజానికి ఇళ్లలో ఎన్ని జాగ్రత్తలు వాడినా కూడా ఎక్కడో చోట బల్లులు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. వీటిని ఇంటి నుంచి పారద్రోలడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే, వీటిని ఇళ్ల నుంచి వెళ్లగొట్టడానికి వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పని లేదు. సింపుల్‌గా చిన్న చిన్న ట్రిక్స్ వాడి బల్లుల బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఇంటిని చల్లగా ఉంచండి:
బల్లులు వెచ్చని, తేమతో కూడిన ప్రదేశాలను ఇష్టపడుతుంటాయి. ఫ్యాన్లను ఉపయోగించడం, కిటికీలు తెరిచి ఉంచడం, ఇంటిలో ఉష్ణోగ్రతల్ని తగ్గించడం ద్వారా బల్లులను ఇళ్ల నుంచి వెల్లగొట్టవచ్చు.
పుదీనా, లవంగం నూనె:
పుదీనా, లవంగం నూనె ఉపయోగించడం ద్వారా బల్లుల్ని నివారించవచ్చు. వీటి నుంచి వచ్చే బలమైన వాసనను బల్లులు ఇష్టపడవు. నీటిలో కొన్ని చుక్కలు పుదీనా, లవంగం నూనెను కలపడం ద్వారా ఒక స్ప్రేని తయారు చేయవచ్చు. దీనిని కిటికీలు, ఫర్నీచర్ వెనక, వంట గదిలో లేదా బల్లులు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో స్ప్రే చేయడం ద్వారా ఫలితాలు చూడవచ్చు.
మెష్ స్క్రీన్ వాడాలి:
చాలా బల్లులు కిటికీలు, బాల్కనీలు, తలుపుల ద్వారా ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. వీటికి మెష్ స్క్రీన్ పెట్టడం ద్వారా ఇంటి లోపలికి రాకుండా చూడవచ్చు. ఇది దోమలను, ఈగలను కూడా అడ్డుకుంటుంది.
ఆహారాన్ని ఎప్పటికప్పుడ క్లీన్ చేయాలి:
ఇంట్లో కీటకాలు బల్లుల్ని ఆకర్షిస్తాయి. కీటకాలు రావడానికి ఆహార పదార్థాలు కారణం అవుతాయి. ముఖ్యంగా వంట గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. రాత్రి సమయం లైట్లు ఆపేయడం ద్వారా కీటకాలను తగ్గించవచ్చు.
మూలల్లో పసుపు, వెల్లుల్నిని ఉంచండి:
పసుపు, వెల్లుల్లి నుంచి వచ్చే బలమైన సువాసన కారణంగా బల్లులు ఆ ప్రాంతాల్లో ఉండవు. బల్లులు తరుచుగా కనిపించే ప్రాంతాల్లో చితక్కొట్టిన వెల్లులిని ఉంచండి. పసుపు పొడిని చల్లండి.
కోడి గుడ్డు పెంకును ఉపయోగించండి:
కోడి గుడ్డు పెంకును ఉపయోగించి బల్లుల్ని పారద్రోలవచ్చు. బల్లులు వీటిని చూసి పెద్ద మాంసాహారి తమకు దగ్గర ఉందని భావిస్తుంది. వీటికి దూరంగా బల్లులు పారిపోతాయి.
పగుళ్లను, ఖాళీలను మూసేయాలి:
బల్లులు చిన్న పగుళ్లు, చీకటిగా ఉండే ప్రాంతాలను ఇష్టపడుతుంటాయి. ఫోటో ఫ్రేమ్‌ల వెనక ఉంటాయి. ఖాళీలను, పగుళ్లను మూసేయడం ద్వారా వీటిని అరికట్టవచ్చు.