
Off The Record: ఆ నియోజకవర్గ కాంగ్రెస్‌లో మంటలు ఇప్పట్లో ఆరవా? తగ్గినట్టే తగ్గి మళ్లీఇప్పుడు ఎందుకు భగ్గుమన్నాయి? ఆ సెగల ధాటికి పార్టీ పంచాయతీ సీట్లు మలమల మాడిపోయే ముప్పు పొంచి ఉందా? రెండు వర్గాలు కొట్టుకుని ప్రత్యర్థులకు పంచాయతీల్ని సమర్పించుకునే పరిస్థితి ఎక్కడుంది? అగ్గి మళ్ళీ ఎందుకు అంటుకుంది?
Read Also: Off The Record: గద్వాల, వనపర్తి కాంగ్రెస్ లో పీక్స్ కు వర్గపోరు.. పంచాయతీ ఎన్నికల ముందు కంగారు
కొమురం భీం జిల్లాలో గ్రూప్ వార్ కాంగ్రెస్ పార్టీకి గుదిబండగా మారుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిలో ఇద్దరు నాయకుల మధ్య పోరు పార్టీని ఎటు తీసుకువెళ్తుంతోదన్న భయాలు పెరుగుతున్నాయి. ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న విశ్వప్రసాదరావును తొలగించి ఆత్రం సుగుణకు పగ్గాలు అప్పగించింది అధిష్టానం. ఆమె ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న క్రమంలో ఇన్ఛార్జ్ శ్యాం నాయక్ ఆమె సమక్షంలోనే మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్‌రావ్ టార్గెట్గా తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తానుంటే ప్రత్యర్థి గెలుపుకోసం పనిచేశారని ఇన్నాళ్ళు చెబుతూ వచ్చారాయన. తాజాగా అంతకుమించిన ఆరోపణలు చేశారు శ్యాంనాయక్. అసెంబ్లీ ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచారన్న ఆరోపణలతో.. వీళ్లిద్దరి మధ్య స్పర్ధలే కాకుండా…నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయింది.
Read Also: CP Sajjanar : 10 గ్యాంగ్ లకు చెందిన 86 మంది బైండోవర్..
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్యాం నాయక్ పోటీ చేయగా అప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న విశ్వప్రసాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మికి సపోర్ట్ చేశారన్నది ప్రధానమైన ఆరోపణ. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో సైతం గ్రూప్ వార్ తెరపైకి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్రంలో కులగణన విషయంలో పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా రెండు వర్గాల మధ్య గొడవ తారా స్థాయికి చేరింది. అప్పట్లో కుర్చీలు విసురుకోవడం, నిరసనలకు దిగడం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. తర్వాత కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉన్నా… మళ్ళీ డీసీసీ అధ్యక్ష పదవి మార్పుతో రచ్చ మొదలైంది. విశ్వప్రసాద్ రావ్ నామినేటెడ్ పోస్టులను సైతం అమ్ముకున్నాడని, మార్కెట్ కమిటీ చైర్మన్స్‌తో పాటు ఇతర పదవుల్ని బీఆర్ఎస్ కోసం పనిచేసిన వారికి ఇచ్చారని ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. అధిష్టానం డీసీసీని మార్చగా… విశ్వప్రసాద్ వర్గం వ్యతిరేకించింది. అయితే అధిష్టానం నిర్ణయాన్ని పాటించని వాళ్లు పార్టీలో కొనసాగకూడదన్న శ్యాం నాయక్ , 2023 ఎన్నికల సమయంలో విశ్వప్రసాద్ నలుగురిని బలిచేశారంటూ ఫైరయ్యారు.
Read Also: BJP: ఎన్నికలకు ఒక రోజు ముందు, బీజేపీలో చేరిన ఆప్ కీలక నేత..
కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు దారుడని విమర్శించడంతో… పార్టీలో మళ్లీ గ్రూప్ వార్‌కు తెర లేచిందని అంటున్నారు. సీనియర్ కార్యకర్తలను వదిలేసి అధికారాన్ని అప్పటి డీసీసీ మిస్ యూజ్ చేశారనే ఆరోపణలు సైతం చేశారట శ్యాంనాయక్. తిర్యాణి,జైనూర్ లలో ఇచ్చిన నామినేటెడ్ పదవుల విషయంలో ఏదో జరిగిందని మాట్లాడడం పార్టీలో అంతర్గతంగా చర్చకు దారితీసింది. ఇదే విషయంపై మాజీ డీసీసీ వర్గం గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. విశ్వప్రసాద్‌కు సరైన గుర్తింపు ఇవ్వాలని, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నష్టపోతుందన్న హెచ్చరికలు సైతం వస్తున్నాయట. గ్రామాల్లో పట్టుకోసం ఆరాటపడుతూ క్యాడర్‌ను సిద్ధం చేయాల్సిన నేతలు ఇలా గ్రూప్‌వార్‌తో టైంపాస్ చేస్తుంటే… సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కచ్చితంగా నష్టం జరుగుతుందని అంటోంది కాంగ్రెస్ కట్టర్ కేడర్. పార్టీ మద్దతుదారులకు భరోసా ఇవ్వడం మాట అటుంచితే… గ్రూప్‌వార్‌తో పక్క పార్టీ మద్దతు దారులు లాభపడతారన్న అంచనాలు పెరుగుతున్నాయి. అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని గొడవలకు చెక్ పెడితే తప్ప… పంచాయతీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ జిల్లాలో పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు దక్కవంటోంది కేడర్.