Pakistan: పాకిస్తాన్‌కు ఫిన్లాండ్ షాక్.. రాయబార కార్యాలయం మూసివేత..

Finland To Close Embassy In Pakistan By 2026 Citing Operational And Strategic Reasons

Pakistan: పాకిస్తాన్ బయటకు ఎన్ని బీరాలు పలుకుతున్నా కూడా తోటి ముస్లిం దేశాలు పట్టించుకోవడం లేదు. సౌదీ అరేబియా, యూఏఈ వంటి ఇస్లామిక్ దేశాలు పాకిస్తానీయులకు నో ఎంట్రీ బోర్డు పెడుతున్నాయి. పాకిస్తాన్ నుంచి వెళ్లిన వారు ఈ దేశాల్లో భిక్షాటన చేయడం, నేరాలకు పాల్పడుతుండటంతో ఆయా దేశాలు వీరికి వీసాలు మంజూరు చేయడం లేదు.

ఇదిలా ఉంటే, తాజాగా పాకిస్తాన్‌కు మరో షాక్ తగిలింది. ఆపరేషనల్, వ్యూహాత్మక కారణాలను చెబుతూ పాకిస్తాన్‌లో ఫిన్లాండ్ తన రాయబార కార్యాలయాన్ని మూసేయనుంది. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్ దేశాల్లో కూడా ఎంబసీలను క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. “2026లో ఇస్లామాబాద్, కాబూల్, యాంగోన్‌లలోని ఫిన్లాండ్ రాయబార కార్యాలయాలను మూసివేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది” అని ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. ‘‘ఆపరేషనల్, వ్యూహాత్మక కారణాల వల్ల రాయబార కార్యాలయాలు మూసివేయబడుతాయి. ఇది దేశాల రాజకీయ పరిస్థితుల్లో మార్పులు, ఫిన్లాండ్‌తో వారి పరిమిత వాణిజ్య, ఆర్థిక సంబంధాలతో ముడిపడి ఉన్నాయి’’ అని ప్రకటన తెలిపింది.

Read Also: Xiaomi Black Shark GS3 Ultra: 18 రోజుల బ్యాటరీ బ్యాకప్ తో.. షియోమీ బ్లాక్ షార్క్ GS3 అల్ట్రా స్మార్ట్‌వాచ్ రిలీజ్

పాకిస్తాన్‌తో సహా మూడు దేశాల్లో రాయబార కార్యాలయ మూసివేతకు సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఫిన్లాండ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యూహాత్మక సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. తమకు వ్యూహాత్మకంగా ముఖ్యమైన దేశాలకు వనరుల్ని కేంద్రీకరించడం ముఖ్యమని చెప్పింది. దీనిని బట్టి చూస్తే పాకిస్తాన్ మాకు అవసరం లేదని స్పష్టం చేస్తునట్లు కనిపిస్తోంది. దీనికి ముందు 2012లో పాకిస్తాన్‌లో రాయబార కార్యాలయాన్ని, బడ్జెట్ పరిమితులను కారణంగా చూపిస్తూ మూసేసింది. 2022లో మళ్లీ ప్రారంభించింది. ఇప్పుడు 2026లో మళ్లీ మూసేస్తోంది. 2023లో స్వీడన్ భద్రతా కారణాలను చెబుతూ పాక్‌లో తన ఎంబసీని నిరవధికంగా క్లోజ్ చేసింది.