Team India Photoshoot: వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా సరదా ఫోటో షూట్‌! వీడియో చూశారా..

Team India Photoshoot Ranchi Odi Series Video

Team India Photoshoot: రాంచీలో నవంబర్ 30న టీమిండియా – దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా ఒక ఫోటోషూట్‌లో పాల్గొంది. ఈ వీడియోను BCCI సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోతో క్రికెట్ ప్రేమికులు మస్తు ఖుషీ అవుతున్నారు. వీడియోలో రిషబ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మొదలైన ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ వీడియోలో రిషబ్ పంత్‌తో ఫోటోగ్రాఫర్ మామూలు కామెడీ చేయలేదు. ఫోటో తీసే టైంలో పంత్ సరిగ్గా నవ్వలేకపోవడంతో, ఫోటోగ్రాఫర్ పంత్‌ను కొంచెం నవ్వమని అడిగాడు, దానికి ఈ స్టార్ ప్లేయర్ సూపర్ సమాధానం ఇచ్చాడు.

READ ALSO: Pakistan: పాకిస్తాన్‌కు ఫిన్లాండ్ షాక్.. రాయబార కార్యాలయం మూసివేత..

ఇతర టీమిండియా ఆటగాళ్ల మాదిరిగానే పంత్ కూడా ఫోటోషూట్ కోసం వచ్చాడు. అయితే ఫోటోగ్రాఫర్ పంత్‌వి కొన్ని ఫోటోలు తీశాడు, తర్వాత ఆయన పంత్‌ను కొంచెం నవ్వమని అడిగాడు. దీంతో పంత్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నిద్రపోయానని, ఇంతకు ముందే మేల్కొన్నానని బదులిచ్చాడు. ఫోటో తీస్తుండగా పంత్ కళ్లలో నిద్ర కనిపించిందని పలువురు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ తన ఫోటోను ప్రొఫెషనల్ పద్ధతిలో తీయించుకోగా, రోహిత్ శర్మ ఫోటోగ్రాఫర్‌కు ముందుగా ఏ యాంగిల్ తీయాలో సూచించాడు.

ఇదంతా పక్కన పెడితే టీమిండియాకు వన్డే సిరీస్ గెలవడం చాలా కీలకం. దక్షిణాఫ్రికా చేతిలో ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను భారత జట్టు కోల్పోయింది. 0-2 తేడాతో క్లీన్ స్వీప్ తర్వాత, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విమర్శలను ఎదుర్కొంటున్నాడు, ఇదే సమయంలో ఆయనను పదవి నుంచి తొలగించాలనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడు టీమిండియా వన్డే ఫార్మాట్‌లో బాగా రాణించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి సిరీస్‌ను భారత్ కోల్పోయింది. దక్షిణాఫ్రికాపై కూడా అదే జరిగితే, కోచ్ నుంచి మొత్తం టీం వరకు అందరిపై నిస్సందేహంగా ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

READ ALSO: Ditva Cyclone: తమిళనాడుకు దిత్వా తుఫాన్ ఏఫెక్ట్..