Pocharam Infocity: ఇన్ఫోసిస్ క్యాంపస్ సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు.. కట్‌చేస్తే..

Hyderabad Infocity Pocharam Secret Digging Treasure Hunt Police Arrest

Pocharam Infocity: పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ పక్కన అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పద కదలికలు కనిపించాయి. టార్చ్‌లైట్లు, పూజా సామాగ్రి, గడ్డపారలతో కొందరు వ్యక్తులు ఏదో చేస్తున్నట్లు అనుమానం వచ్చింది. చూస్తే ఏదో రహస్య కార్యక్రమం జరుగుతున్నట్టే అనిపించింది. ఇదే విషయం స్థానికుల దృష్టికి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నప్పుడు.. తవ్విన ఓ పెద్ద గుంతతో పాటు.. పగలగొట్టిన కొబ్బరికాయలు, నిమ్మకాయలు కనిపించాయి. ఇది ఏదో పూజ తంతులా అనిపించింది. స్పాట్‌లో 8 మంది వ్యక్తులకు పోలీసులకు చిక్కారు. ప్రశ్నిస్తే మొదట్లో ఎవరూ నోరు విప్పలేదు. ఎంత అడిగినా ఏమీ లేదు సార్ అని తప్పించుకునే ప్రయత్నం చేశారు.

READ MORE: Off The Record : రాజోలు రచ్చకు అసలు కారణం ఏంటి ? పవన్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితులు మారట్లేదా ?

చివరకు పోలీసులు తమదై స్టైల్‌లో అడగడంతో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని.. ఒక కారు, రెండు బైకులు, పూజా వస్తువులు, గుంతలు తవ్వే సామగ్రి, ఎనిమిది మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. కొన్ని రోజుల క్రితం వరంగల్, ములుగు జిల్లాల్లో కూడా ఇదే తరహా కథ హడావుడి చేసింది. మంగపేట ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ .. మరికొందరితో కలిసి మహారాష్ట్రలో తవ్వకాలు జరిపి రాగి బిందె దొరికిందని చెప్పాడు. అందులో బంగారు నాణేలు ఉన్నాయంటూ గుట్టుగా పంచుకునే ప్లాన్ వేసినప్పటికీ, పంపకాల విషయంలో గొడవ జరిగి విషయం పోలీసులకు దృష్టికి వెళ్లింది. ఈజీగా వచ్చే డబ్బు అన్నది.. కేవలం కథల్లో, కబుర్లలో మాత్రమే ఉంటుంది. నిజ జీవితంలో మాత్రం కష్టాన్ని తప్పించే షార్ట్ కట్‌లు అన్నీ.. చివరకు పోలీస్ స్టేషన్‌ వద్దకే తీసుకెళ్తాయి.

READ MORE: IBomma Ravi : ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి