Ranveer Singh : IFFIలో కాంతారాపై రణవీర్ కామెంట్‌.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కన్నడ అభిమానులు..

Ranveer Singh Kantara Iffi Controversy Kannada Fans Outrage

గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు కార్యక్రమంలో రణవీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. స్టేజ్‌పై సూపర్ ఎనర్జీతో మాట్లాడడం, డ్యాన్స్ చేయడం రణవీర్‌కు కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన చేసిన ఈ జోష్‌ కన్నడ ప్రేక్షకులను అస్సలు నచ్చలేదు. రజనీకాంత్‌కు ట్రిబ్యూట్ ఇస్తూ మాట్లాడిన రణవీర్‌ను అక్కడివాళ్లు బాగా చప్పట్లు కొట్టారు. కానీ మాటల మధ్యలో, కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి చేసే దైవిక అరుపును ఆయన స్టేజ్‌పై అనుకరించాడు. ఇదే అసలు సమస్య..

Also Read : Spirit : స్పిరిట్ కోసం.. ప్రభాస్‌ విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న సందీప్ రెడ్డి వంగా

రణవీర్ స్టేజ్‌లో ఆ అరుపు చేస్తున్నప్పుడు రిషబ్ శెట్టి కూడా అసహజంగా, అసౌకర్యంగా ఉన్నట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు రణవీర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు అయితే అతని రాబోయే సినిమా ‘దురంధర్’ ను బహిష్కరిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. అలాగే కాంతారా రిలీజ్ టైమ్‌లో కూడా, థియేటర్లలో దైవం లాగా అరవకండి, అలాగే నా గెటప్‌లో రావడం లాంటివి చేయకండి అని స్వయంగా రిషబ్ సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అదే పనిని పెద్ద స్టేజ్‌పై రణవీర్ చేయడంతో ఈ వివాదం టాప్ ట్రెండ్ అయిపోయింది. మరి దీనిపై రణవీర్ స్పందిస్తారా ? చూడాలి.