
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ (శివన్న) ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. రామ్ చరణ్ , శివన్న కలిసి నటిస్తున్న కీలక యాక్షన్ సన్నివేశాన్ని హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని యూనిట్ వర్గాల టాక్.
Also Read : Jailer2 shooting : జైలర్ 2 షూటింగ్ లో ‘రజనీకాంత్’ రాక్.. నెల్సన్ షాక్
అయితే ఈ ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌కి బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ తండ్రి, దంగల్, బాజీరావ్ మస్తానీతో పాటు తెలుగులో హరిహర వీరమల్లు వంటి చిత్రాలకు యాక్షన్ డిజైన్ చేసిన ప్రముఖ స్టంట్ డైరెక్టర్ షామ్ కౌశల్ పర్యవేక్షణలో నవకాంత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు భారీ స్థాయిలో ఉంటాయని టాక్. ప్రజెంట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నఈ ఫైట్ సీక్వెన్స్‌లో రామ్ చరణ్‌తో పాటు వందల మంది ఫైటర్లు పాల్గొంటున్నారట. రియల్-ఇంటెన్సిటీ, రఫ్-అండ్-రా మాస్ యాక్షన్‌తో రూపొందుతున్న ఈ సీన్ సినిమాకు కీలకమైన టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. కన్నడ రియల్ స్టార్ శివరాజ్‌కుమార్ కూడా ఈ షూట్లో పాల్గొంటున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అయేందుకు రెడీ అవుతోంది. మరోవైపు ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ 100 మిలియన్ దాటి సెన్సేషన్ చేస్తోంది. త్వరలోనే సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది యూనిట్.