
Parliament Session: రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు (నవంబర్ 30న) అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. పార్లమెంట్ అనుబంధ (అనెక్స్) భవనంలో, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో నేడు ఉభయ సభల్లోని అన్ని రాజకీయ పక్షాల నేతల (ఫ్లోర్ లీడర్లు) సమావేశం కానున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన అన్ని రాజకీయ పక్షాల నేతలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కోరనున్నారు.
Read Also: Jailer2 shooting : జైలర్ 2 షూటింగ్ లో ‘రజనీకాంత్’ రాక్.. నెల్సన్ షాక్
అయితే, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో “ఓటర్ల జాబితా క్రమబద్ధీకరణ” (సర్), దేశ రాజధానిలో “ప్రాణాంతక వాయు కాలుష్యం” లాంటి పలు అంశాలపై ఉభయ సభల్లో చర్చ జరిపేందుకు, తగినంత సమయాన్ని కేటాయుంచాలని అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటు, విపక్షాల నేతలు పట్టుబట్టనున్నారు.