
ఆన్లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్‌లో ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ 2025 నడుస్తోంది. నవంబర్ 28న ప్రారంభమైన ఈ సేల్.. డిసెంబర్ 1 వరకు కొనసాగుతుంది. సేల్ సమయంలో అన్ని ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు బడ్జెట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. రెడ్మీ, షావోమీలను మంచి ఎంపిక అని చెప్పొచ్చు. అమెజాన్ సేల్ సమయంలో ఫ్లాట్ డిస్కౌంట్లతో పాటు మీరు బ్యాంక్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. అలానే ఎక్స్ఛేంజ్ ఆఫర్స్, నో-కాస్ట్ ఈఎంఐ ఎంపికలను కూడా పొందవచ్చు. సేల్ సమయంలో అందుబాటులో ఉన్న ఆఫర్ల వివరాలను చూద్దాం.
మీరు Redmi A4 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకుంటే.. పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు. రూ.11,999 ధరకు లిస్ట్ చేయబడిన ఈ ఫోన్ ఇప్పుడు రూ.7,999కి కొనుగోలు చేయవచ్చు. అంటే మీరు 4 వేలు ఆదా చేసుకోవచ్చు. Redmi 13 5G ప్రైమ్ ఎడిషన్‌ను రూ.11,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ లిస్టింగ్ ధర రూ.19,999 కాగా.. 8 వేల రూపాయలు మీకు డిస్కౌంట్ అందుతుంది. మరోవైపు Redmi 15 5Gని రూ.14,999కి కొనుగోలు చేయవచ్చు. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.17,999గా ఉంది.
Also Read: Cyclone Ditwah: తమిళనాడుపై దిత్వా తుఫాన్ పంజా.. దక్షిణ కోస్తా, పుదుచ్చేరికి రెడ్ అలెర్ట్!
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో Redmi Note 14 5Gని రూ.15,499కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ లిస్టింగ్ ధర రూ.21,999. అంటే మీరు రూ.6,500 ఆదా చేసుకోవచ్చు. సేల్ సమయంలో మీరు Redmi Note 14 Pro+ 5Gని రూ.24,999కి కొనుగోలు చేయవచ్చు. దీని లిస్టింగ్ ధర రూ.34,999. అలానే Redmi A5ని రూ.8,999 నుంచి రూ.6,499కి కొనుగోలు చేయవచ్చు. రెడ్మీ ఫోన్లను ఇష్టపడే వారు వెంటనే అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫర్స్ మరో కొన్ని గంటలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.