
Just Corseca Launches Sonic Bar and Sound Shock Plus Soundbars: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘జస్ట్ కోర్సెకా’ రెండు సరికొత్త సౌండ్బార్లను రిలీజ్ చేసింది. దాంతో హోమ్ ఆడియో డివైజ్ రంగంలోకి జేసీ కంపెనీ ప్రవేశించింది. జస్ట్ కోర్సెకా సోనిక్ బార్, జస్ట్ కోర్సెకా సౌండ్ షాక్ ప్లస్ సౌండ్బార్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రెండు మోడళ్లలో 2.2-ఛానల్ సెటప్, సబ్ వూఫర్ ఉన్నాయి. అవి 200W వరకు సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తాయి. ఈ సౌండ్బార్లను ఆన్లైన్, ఆఫ్లైన్లలో కొనుగోలు చేయవచ్చు.
జస్ట్ కోర్సెకా సోనిక్ బార్ 2.2 ఛానల్ లేఅవుట్‌తో కూడిన సబ్ వూఫర్ను కలిగి ఉంటుంది. ఇది వైర్లెస్, వైర్డ్ కనెక్టివిటీ ఎంపికలతో వచ్చింది. ఇది 200W సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. 120W సౌండ్‌బార్ నుంచి, 80W సబ్ వూఫర్ నుంచి వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ v5.0, HDMI ARC, కోక్సియల్, USB సహా AUX ఉన్నాయి. మీరు దీన్ని టీవీ, ప్రొజెక్టర్, ఫోన్, పీసీ, ల్యాప్‌టాప్‌కు ఉపయోగించవచ్చు.
జస్ట్ కోర్సెకా సౌండ్ షాక్ ప్లస్ 160W సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. సౌండ్‌బార్ నుంచి 90W, సబ్ వూఫర్ నుండి 60W అవుట్‌పుట్ మనకు అందిస్తుంది. ఈ సౌండ్‌బార్ 2.2 ఛానల్ ఆడియోతో కూడా వస్తుంది. మీరు కనెక్టివిటీ ఎంపికలను కూడా పొందుతారు. ఈ సౌండ్‌బార్‌లో TF కార్డ్, FMని కూడా ఉపయోగించవచ్చు.
Also Read: Amazon Sale 2025: రెడ్మీ ఫోన్లపై ఆఫర్ల జాతర.. 12 వేలకే Redmi 13 5G, 8 వేలకే Redmi A4 5G!
జస్ట్ కోర్సెకా సోనిక్ బార్, జస్ట్ కోర్సెకా సౌండ్ షాక్ ప్లస్ మోడళ్లలో సౌండ్‌బార్, సబ్ వూఫర్, ఛార్జింగ్ కేబుల్ సహా రిమోట్ కంట్రోల్ ఉన్నాయి. సోనిక్ బార్ ధర రూ.7,499 కాగా.. సౌండ్ షాక్ ప్లస్ ధర రూ.6,499. రెండు సౌండ్బార్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, కంపెనీ అధికారిక వెబ్సైట్ సహా రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఒక సంవత్సరం వారంటీని కూడా అందిస్తోంది.