Abhishek Sharma: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన అభిషేక్ శర్మ.. 32 బంతుల్లో 16 సిక్సర్లు.. 8 ఫోర్లు (వీడియో)..

Abhishek Sharma 148 Runs 16 Sixes Fastest Fifty Smatt 2025

Abhishek Sharma: టీమిండియా స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ మరోసారి రెచ్చిపోయాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో సంచలనం సృష్టించాడు. పంజాబ్ తరుఫున ఆడుతున్న అభిషేక్ ప్రత్యర్థి బెంగాల్ జట్టుకు చుక్కలు చూపించాడు. నేడు నవంబర్ 30 ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ 52 బంతుల్లో 16 సిక్సర్లు, 8 ఫోర్లతో సహా 148 పరుగులు చేశాడు. ఇది అభిషేక్ శర్మకు T20 క్రికెట్‌లో ఎనిమిదో సెంచరీ. 157 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్నాడు ఈ స్టార్ ప్లేయర్. T20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారతీయ బ్యాట్స్‌మెన్‌ జాబితాలో చేరాడు. మాజీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. టీ20 సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ (9) నిలవగా.. రోహిత్, అభిషేక్ తరువాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

READ MORE: SIM Binding: కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.. సిమ్‌ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ సేవలు!

అయితే.. తాజాగా జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ పురుషుల టీ20 క్రికెట్‌లో ఇది మూడో వేగవంతమైన అర్ధ సెంచరీ. అలాగే రెండవ వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన భారతీయ ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. 2007 టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌పై కేవలం 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశాడు. అతర్జాతీయ పురుషుల T20 క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీ సాధించాడు. 2023 సెప్టెంబర్‌లో హాంగ్‌జౌ ఆసియా క్రీడల సందర్భంగా మంగోలియాపై కేవలం తొమ్మిది బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అనంతరం.. భారత్‌కి చెందిన అశుతోష్ శర్మ రెండవ స్థానంలో ఉన్నాడు. అరుణాచల్ ప్రదేశ్‌పై రైల్వేస్ తరపున 11 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు.