
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న చిత్రం స్పిరిట్’. మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఈ భారీ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ తో పాటు సందీప్ వంగా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read : Tollywood : వరుస ప్లాప్స్.. రెమ్యునరేషన్ తగ్గించుకున్న టాల్ బ్యూటీ
కాగా ఈ సినిమాకు సంబందించి ఓకే క్రేజీ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. సాధారణంగా ఏ సినిమాకు అయిన ప్రీ-బిజినెస్ బినిజెస్ జరగాలంటే టీజర్, ఫస్ట్ లుక్‌లు, సాంగ్స్ ఇలా ఎదో ఒక కంటెంట్ రిలీజ్ చేయాలి. కానీ సందీప్ – రెబల్ స్టార్ కాంబో లో తెరకెక్కుతున్న స్పిరిట్ విషయం అందుకు మినహాయింపు అనే చెప్పాలి.. సినిమా ఇంకా ప్రారంభ దశలోనే ఉండగానే స్పిరిట్ డిజిటల్ హక్కులు భారీ ధర పలికాయి. వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ స్పిరిట్ డిజిటల్ హక్కులును రూ. 160 కోట్లకు కొనుగోలు చేసిందట. అందుకు సంబందించిన డీల్ క్లోజ్ చేసేసారట మేకర్స్. కనీసం పోస్టర్ కూడా రాకుండ ఇంత భారీ డిజిటల్ డీల్ కుదరడం అంటే కంబినేషన్ క్రేజ్ అనే చెప్పాలి. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఈ డిసెంబరులో స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు వంగా. స్పిరిట్ డిజిటల్ రైట్స్ తో మరోసారి రికార్డుల రారాజు ప్రభాస్ రాజు అని అనిపించుకున్నాడు రెబల్ స్టార్.