
ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌లో ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ నడుస్తోంది. 2025 నవంబర్ 28న ప్రారంభమైన బ్లాక్ ఫ్రైడే సేల్.. డిసెంబర్ 1 వరకు కొనసాగుతుంది. సేల్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలు, గాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ క్రమంలో గూగుల్ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘గూగుల్ పిక్సెల్ 10’పై భారీ డిస్కౌంట్ ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతం రూ.14,000 కంటే ఎక్కువ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఇది అద్భుత ఆఫర్స్ అనే చెప్పాలి. ఎందుకంటే.. కొత్తగా లాంచ్ చేయబడిన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై ఇంత భారీ డిస్కౌంట్లు ఉండడం చాలా అరుదు. మీరు ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్‌కు మారాలనుకుంటే.. ఇది సరైన అవకాశం.
గూగుల్ పిక్సెల్ 10 భారతదేశంలో రూ.79,999 ధరకు లాంచ్ అయింది. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో రూ.11,349 తగ్గింపు లభిస్తోంది. దాంతో ఫోన్ ధర రూ.68,650కి తగ్గింది. అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై రూ.3,250 తగ్గింపు లభిస్తుంది. మొత్తంగా 14 వేలకు పైగా మీకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ద్వారా మరింత ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. మొత్తంమీద ఈ డీల్ సరసమైన ధరకు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి మంచి అవకాశాన్ని అందిస్తుంది.
Also Read: Gautam Gambhir-BCCI: స్వదేశంలో రెండు వైట్‌వాష్‌లు.. గంభీర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం!
గూగుల్ పిక్సెల్ 10లో 6.3 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేటు, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఈ స్క్రీన్ సొంతం. గూగుల్ ప్రాసెసర్ టెన్సర్ జీ5ని ఇందులో ఇచ్చారు. ఫోన్ వెనక భాగంలో 48 ఎంపీ ప్రధాన కెమెరా, 13 ఎంపీ అల్ట్రావైడ్, 10.8 ఎంపీ టెలిఫొటో కెమెరా ఉండగా.. ముందు భాగంలో 10.5 కెమెరా ఉంది. పిక్సెల్ 10లో 4970 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 30W వైర్డ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.