Jagtial: సర్పంచ్‌ పోరుకు కన్నతల్లితోనే పోటీ.. నామినేషన్ దాఖలు చేసిన తల్లీకూతుళ్లు

Timmaiahpalli Sarpanch Election Mother Daughter Contest

Jagtial: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లిలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ స్థానానికి తల్లీకూతుళ్లు పోటీకి దిగారు. తల్లి గంగవ్వ, కూతురు పల్లెపు సుమ నామినేషన్ దాఖలు చేశారు. తిమ్మయ్యపల్లి సర్పంచ్ స్థానం బీసీ మహిళ రిజర్వ్ చేశారు. పల్లెపు సుమ అదే గ్రామానికి చెందిన అశోక్‌ను 2017లో ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఇరు కుటుంబ మధ్య కలహాలు మొదలయ్యాయి. మొన్నటి వరకు సుమ తండ్రి గ్రామ సర్పంచ్‌గా పోటీ చేశారు. తల్లికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపగా కూతురుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. మొత్తం ఓట్లు 506 ఉండగా ఎనిమిది వార్డులు ఉన్నాయి. సర్పంచ్ స్థానానికి మొత్తం నలుగురు పోటీ చేస్తుండగా తల్లి, కూతురు మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

READ MORE: Botsa Satyanarayana: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది..