Akhanda 2 : అఖండ 2 సెన్సార్ క్లియర్.. వైలెన్స్ ఉన్నా U/A రావడానికి కారణం ఇదే

Akhanda 2 Censor Ua Certificate Reason Explained

నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2: తాండవం’ విడుదలకు చివరి అడ్డంకి కూడా తగ్గిపోయింది. డిసెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, అధికారికంగా యూ/ఏ సర్టిఫికెట్‌ను పొందింది. బోయపాటి సినిమాల్లో సాధారణంగా ఉండే వైలెన్స్ డోస్ ఎక్కువ ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ఈసారి డివోషనల్ టచ్, భావోద్వేగాలు, మాస్ హైప్ మధ్య బ్యాలెన్స్‌ను బాగా కాపాడినందువల్లే యాక్షన్ సీన్స్ ఉన్నా U/A రావడానికి అవకాశం ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలకు వైలెన్స్ ఎక్కువైతే A సర్టిఫికెట్ వస్తుంది, ‘అఖండ 2’కు U/A రావడం ఇండస్ట్రీలోనే చిన్న సంచలనంగా మారింది. ముఖ్యంగా అఘోరా గెటప్‌లో బాలయ్య విలన్లపై జరిపే యాక్షన్ సీన్స్ ఉన్నప్పటికీ, బోయపాటి వైలెన్స్ డోస్‌ను నియంత్రిస్తూ కథకు అవసరమైన భావోద్వేగాలకు, భక్తి రసానికి ప్రాధాన్యం ఇవ్వడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణం అని చెప్పాలి.

Also Read : Rajendra Prasad: మరోసారి నోరిజారిన రాజేంద్ర ప్రసాద్.. బ్రహ్యానందంని అంత మాట అనేశాడేంటి?

యూనిట్ విడుదల చేసిన తాజా పోస్టర్‌లో బాలయ్య అఘోరా వేషంలో గద పట్టుకుని ముందుకు నడుస్తున్న తీరు సినిమాకు మరింత ఇమేజ్ క్రియేట్ చేసింది. వెనుక ఆంజనేయ స్వామి ప్రతిమ, దేవాలయాల బ్యాక్‌డ్రాప్ కనిపించడం కథలో దైవ శక్తి–దుష్ట శక్తి మధ్య పోరాటం మళ్లీ కీలకంగా ఉండబోతుంద‌నే క్లూ ఇస్తోంది. మొదటి భాగం ‘అఖండ’లో శివుడి ఆధ్యాత్మికత ముఖ్యమైనట్లు, ఈసారి హనుమంతుని శక్తి కథనంలో ప్రధాన పాత్ర పోషించబోతుందని స్పష్టమవుతోంది. తమన్ సంగీతం, బోయపాటి మార్క్ ఎలివేషన్స్, బాలయ్య పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ అని కలిపి భారీ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నాయని ఫ్యాన్స్ నమ్మకం.

ఇక 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ భారీ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండటంతో, ఇతర భాషల్లో కూడా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. భారీ ప్రీ-రిలోస్ బిజినెస్ పూర్తయిన నేపథ్యంలో, ఓపెనింగ్ సినిమాకు అత్యంత కీలకంగా మారాయి. ఇక అన్ని పనులు పూర్తయ్యాక, ఇప్పుడు మిగిలింది ఒక్కటే బాక్సాఫీస్ తీర్పు. సీక్వెల్ సెంటిమెంట్, బాలయ్య మాస్ హైప్, బోయపాటి టేక్ అని కలిపి ‘అఖండ 2: తాండవం’ ఎంతవరకు రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.