
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు రస్సెల్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తన క్రికెట్ కెరీర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్‌లలో, అలానే కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ తరఫున ఆడుతానని చెప్పాడు. కోల్‌కతాకు సపోర్టింగ్ స్టాప్, పవర్ కోచ్‌గా కొనసాగుతానని రస్సెల్ చెప్పుకొచ్చాడు.
Also Read: Virat Kohli Test Comeback: విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. టెస్ట్ క్రికెట్‌లోకి మరలా ‘కింగ్’?
గత 12 ఏళ్లుగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఆండ్రీ రస్సెల్ ఆడిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు అతడిని కేకేఆర్ విడుదల చేసింది. రస్సెల్ ఇప్పటివరకు 140 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 174.2 స్ట్రైక్ రేట్, 28.2 యావరేజ్‌తో 2651 రన్స్ చేశాడు. ఇందులో 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 88 నాటౌట్. బౌలింగ్‌లో 23.3 యావరేజ్‌తో 123 వికెట్లు పడగొట్టాడు. ఒకసారి 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. రస్సెల్ తన బ్యాటింగ్, బౌలింగ్‌తో కేకేఆర్ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. రస్సెల్ 2012, 2013 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)కి ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు.