
Gorakhpur: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో ఉన్న హనుమాన్ ప్రసాద్ పోద్దార్ క్యాన్సర్ ఆసుపత్రిలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా గందరగోళ వాతారవరం ఏర్పడింది. దీనికి కారణం.. వేగంగా వచ్చిన ఓ బోలెరో వాహనం అదుపు తప్పి ఆసుపత్రి పార్కింగ్‌లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో పార్కింగ్‌లో నిలిపి ఉంచిన 16 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో కొందరు వ్యక్తులు తమ బైక్‌ల పక్కన నిలబడి ఉన్నారు. అయితే వారు ప్రమాదాన్ని అంచనా వేసి సమయానికి పక్కకు తప్పుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.
Virat Kohli Test Comeback: విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. టెస్ట్ క్రికెట్లోకి మరలా ‘కింగ్’?
ఇక ఘటన తర్వాత, సంఘటనా స్థలానికి చేరుకున్న షాపూర్ పోలీసులు బోలెరో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని బడహల్గంజ్ మఝరియాకు చెందిన యశ్వంత్ యాదవ్‌గా గుర్తించారు. తన బంధువుకు రక్తం ఇవ్వడానికి ఆసుపత్రికి వచ్చానని, అయితే అకస్మాత్తుగా కారుపై నియంత్రణ కోల్పోయానని విచారణలో యశ్వంత్ తెలిపాడు. డ్రైవర్ వద్ద చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉందని పోలీసులు ధృవీకరించారు.
ఈ సంఘటన మధ్యాహ్నం 1:18 గంటల సమయంలో జరిగింది. బోలెరో పార్కింగ్‌లోకి దూసుకెళ్లగానే.. వరుసగా నిలిపి ఉంచిన బైక్‌లు, స్కూటర్లను గుద్దుకుంటూ ముందుకు వెళ్లింది. దీనితో పలు వాహనాలు ఒకదానిపై ఒకటి పడి చిక్కుకుపోగా, మరికొన్ని వాహనాలు దూరంగా పడిపోయాయి. ఘ్తన అనంతరం వెంటనే ఆసుపత్రి గేటు వద్ద ఉన్న సిబ్బంది, భద్రతా సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చి కారును అదుపు చేసి డ్రైవర్‌ను పట్టుకున్నారు. ఈ ప్రమాదంలో వాహనాలు ధ్వంసమైన యజమానులు షాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Akhanda 2 : అఖండ 2 సెన్సార్ క్లియర్.. వైలెన్స్ ఉన్నా U/A రావడానికి కారణం ఇదే
ఈ ఘటనపై సీఓ గోరఖ్‌నాథ్ రవి కుమార్ సింగ్ మాట్లాడుతూ.. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఎఫ్ఎస్ఎల్ (FSL) బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుందని తెలిపారు. ఈ ప్రమాదం ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ప్రజలు, వాహన యజమానుల మధ్య తీవ్ర ఆందోళన కలిగించింది. అయితే, పోలీసులు, భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించడం వలన పెద్ద ప్రమాదం తప్పింది.