Rohit Sharma: హిట్ మ్యాన్ దెబ్బ.. రికార్డులు అబ్బా.. అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డు బద్దలు!

New Milestone In Ranchi Rohit Sharma Breaks World Record For Most Sixes In Odi Cricket

Rohit Sharma: రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేడు జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై మూడు భారీ సిక్సర్లు కొట్టి రోహిత్ శర్మ వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డును అధిగమించాడు. దీనితో పాకిస్తాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిదీ రికార్డును బద్దలు కొట్టాడు. దక్షిణఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. మొదట్లో జైస్వాల్ తక్కువ పరుగులకే వెనుతిరిగినా.. రోహిత్, కోహ్లీలు వారి భారీ హిట్టింగ్ తో భారత జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.

Gorakhpur: ఆసుపత్రి పార్కింగ్‌లో బీభత్సం.. విధ్వంసం సృష్టించిన బోలెరో..!

ఇక 38 ఏళ్ల రోహిత్, దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ ప్రేనలెన్ సుబ్రాయన్ బౌలింగ్‌లో కౌ కార్నర్ మీదుగా భారీ స్లాగ్-స్వీప్‌తో తన 350వ వన్డే సిక్స్‌ను కొట్టాడు. ఆ తర్వాత బంతికి అదే షాట్‌ను పునరావృతం చేస్తూ షాహిద్ అఫ్రిదీతో (351 సిక్సర్లు) సమానంగా నిలిచాడు. రోహిత్ కేవలం 100 ఇన్నింగ్స్‌లు తక్కువగా ఆడి ఈ రికార్డును సమం చేయడం విశేషం. ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్‌లలో కలిపి) 645 సిక్సర్లతో అగ్రస్థానంలో రోహిత్ కొనసాగుతున్నాడు.

Andre Russell-IPL: ఐపీఎల్‌కు ఆండ్రీ రస్సెల్‌ ఆల్విదా.. అయినా కోల్‌కతా జట్టులోనే!

తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్న కొద్దిసేపటికే, రోహిత్ శర్మ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో రికార్డు బద్దలు కొట్టిన సిక్స్‌ను సాధించాడు. ఫైన్ లెగ్ ఫెన్స్ మీదుగా బంతిని లాగి కొట్టడంతో అఫ్రిదీ రికార్డును అధిగమించాడు. గతేడాది టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, ఆ ఫార్మాట్‌లో ఇప్పటికీ 200లకు పైగా సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. తన 17 ఏళ్ల కెరీర్‌లో 151 ఇన్నింగ్స్‌లలో 205 సిక్సర్లను నమోదు చేశాడు. ఇక రోహిత్ ఈ ఇన్నింగ్స్ లో 51 బంతులను ఎదురుకొని 5 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 57 పరుగులు చేసి జాన్సెన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.