
అక్క జీవితాన్ని నాశనం చేశాడన్న పగతో బావమరిది చేసిన దాడిలో బావ మృతి చెందగా అత్త తీవ్రంగా గాయపడింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళకు చెందిన సాంబశివరావుకు గణపవరంకు చెందిన సాయికి రెండేళ్ళ క్రితం వివాహం జరిగింది. నాలుగు నెలల తర్వాత ఇద్దరిమధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో సాయిపుట్డింటికి వెళ్లింది. పెద్దలు సర్దిచెప్పినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇద్దరు విడిపోయారు. అయితే అక్క జీవితం నాశనమవడానికి బావ సాంబశివరావు కారణమని మనసులో పగ పెంచుకున్నాడు.
Disha Patani : జాలి, దయ లేని దిశా పాటని.. బ్లాక్ డ్రెస్ లో పరువాల విందు
రెండు రోజులుగా ధూళిపాళ్ళలో రెక్కీ నిర్వహించాడు. వీధిలో ఎవరూ లేని సమయంలో మరో ఇద్దరితో కలిసి బావ సాంబశివరావు ఇంట్లోకి వెళ్లారు. మొదట బావపై కత్తి,గొడ్డలితో దాడికి దిగారు. బావ గొంతుకోసి హత్యచేశాడు. తర్వాత అడ్డువచ్చిన అత్త కృష్ణకుమారిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఇద్దరు చనిపోయారని భావించి పరారయ్యేందుకు ప్రయత్నించారు. సాంబశివరావు ఇంట్లో కేకలు విన్న గ్రామస్థులు పారిపోతున్న ముగ్గురు నిందితులను వెంటాడారు. చాగల్లు వద్ద ముగ్గురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Rohit Sharma: హిట్ మ్యాన్ దెబ్బ.. రికార్డులు అబ్బా.. అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డు బద్దలు!