
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ అద్భుతాల ఆవిష్కరణకు నాంది పలుకుతోంది. రోబోలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా మనిషిలా నడిచే హ్యూమనాయిడ్ రోబోట్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇది 106 కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా నడిచింది. ఈ చైనీస్ రోబో పేరు అగిబోట్ A2. మారథాన్ అథ్లెట్లతో పోటీ పడటానికి మనిషిని పోలిన రోబో వచ్చింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా స్థానం సంపాదించింది. ఈ హ్యూమనాయిడ్ రోబో ఎటువంటి మానవ సహాయం లేకుండా 106.28 కిలోమీటర్ల దూరం నడిచింది.
Also Read:Telangana Rising : సమ్మిట్ కు భారీ బందోబస్తు.. వీవీఐపీ ప్రతినిధుల చుట్టూ మూడంచెల భద్రత
అగిబోట్ A2 నవంబర్ 10, 13 మధ్య సుజౌ నుండి షాంఘై వరకు ప్రయాణించింది. దాని ప్రయాణంలో, రోబోట్ హైవేలు, నగర వీధులు, రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల గుండా ప్రయాణించింది. ఈ దూరాన్ని పూర్తి చేయడానికి అగిబోట్ A2 రోబోట్ దాదాపు మూడు రోజులు పట్టింది. ఇది దాని స్వంత నిర్ణయాలు తీసుకుంది, నావిగేషన్‌ను ఉపయోగించుకుని స్వతహాగ ఎవరికి హాని కలిగించకుండా ప్రయాణించింది.
Also Read:Awantipora Operation: భారత్‌లో జైషే ఉగ్రస్థావరం ధ్వంసం.. ఒకరి అరెస్ట్
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పోర్టల్‌లో జాబితా చేయబడిన వివరాల ప్రకారం, దీని కోసం అగిబోట్ A2 ను చాలా నెలలుగా అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్ కంపెనీ కూడా ఆప్టిమస్ అనే రోబోను నిర్మిస్తోంది. ఈ రోబోట్ దానికదే ప్రత్యేకమైనది. మస్క్ స్వయంగా దాని అనేక వీడియోలను ఆన్లైన్లో పోస్ట్ చేశాడు. కొన్ని గంటల్లోనే ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.