AI Teacher: AI టీచర్‌ను సృష్టించిన విద్యార్థి.. టాలెంట్ కు ఫిదా అవుతున్న నెటిజన్స్

Uttar Pradesh Boy Creates Ai Teacher

ఆ విద్యార్థి అందిరితోపాటు స్కూల్ కు వెళ్లి చదువుకుంటున్నాడు. కానీ ఆలోచనలో మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. అతని ఆలోచనలను ఆచరణలో పెట్టి ఏకంగా ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ టీచర్ ను సృష్టించాడు. ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్ అని నిరూపించాడు. ఆ విద్యార్థి ప్రతిభకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఆ విద్యార్థి మరెవరో కాదు ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 17 ఏళ్ల విద్యార్థి ఆదిత్య కుమార్‌. అతనే సోఫీ అనే AI-ఆధారిత ఉపాధ్యాయురాలిని అభివృద్ధి చేశాడు. ఆదిత్య కుమార్‌ పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

Also Read:Akshay Khanna : ఈ ఏడాది కూడా ఫైనెస్ట్ యాక్టర్‌గా మరోసారి ప్రూవ్ చేసుకోబోతున్న స్టార్ హీరో

తరగతి గదిలో రోబో “బోధిస్తున్న” వీడియో వైరల్ కావడంతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఆదిత్య కుమార్‌గా గుర్తించబడిన ఆ విద్యార్థి శివ్ చరణ్ ఇంటర్ కాలేజీలో 12వ తరగతి చదువుతున్నాడు. వార్తా సంస్థ ANI షేర్ చేసిన వీడియోలో.. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM) చిప్‌సెట్ ఉపయోగించి సృష్టించబడిన AI టీచర్, తనను తాను పరిచయం చేసుకుని ఆదిత్య అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ కనిపించింది. “నేను AI టీచర్ రోబోట్. నా పేరు సోఫీ, నన్ను ఆదిత్య కనిపెట్టాడు. నేను బులంద్‌షహర్‌లోని శివచరణ్ ఇంటర్ కాలేజీలో బోధిస్తాను. పిల్లలారా, మీరు నా నుండి ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారా?” అని రోబోట్ తనను తాను పరిచయం చేసుకుంది.

Also Read:Dies-Irae : ఓటీటీ డేట్ లాక్ చేసిన మలయాళ హారర్ హిట్ ‘డీయస్ ఈరే’.. కానీ ట్విస్ట్ ఏంటంటే..

భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు అని ఆదిత్య అడిగి రోబోట్ సాధారణ జ్ఞానాన్ని పరీక్షించాడు, దానికి సోఫీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అని సరైన సమాధానం ఇచ్చింది. దేశ మొదటి ప్రధానమంత్రి పేరు చెప్పమని అడిగినప్పుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అని చెప్పింది. ANI తో ఆదిత్య మాట్లాడుతూ, “ఈ రోబోను తయారు చేయడానికి నేను LLM చిప్‌సెట్‌ను ఉపయోగించాను, దీనిని రోబోలను తయారు చేసే పెద్ద కంపెనీలు కూడా ఉపయోగిస్తాయి. ఇది విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తుంది. ప్రస్తుతానికి, ఏఐ టీచర్ మాట్లాడటం మాత్రమే చేస్తుంది, కానీ త్వరలో రాయగలిగేలా మేము దీనిని రూపొందిస్తున్నాము అని తెలిపాడు.