
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అఖండ 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అఖండ విజయానంతరం ఈ సీక్వెల్‌పై క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా యాక్షన్ ట్రైలర్ తో సినిమా పై బజ్ అమాంతం పెరిగింది. భారీ అంచానాల మధ్య, భారీ ఎత్తున డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కు రెడీ అయింది అఖండ 2. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఈ ప్రీమియర్స్ కు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వా అనుమతులు కోరినట్టు తెలుస్తోంది. వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ ప్రీమియర్ షోల టికెట్ ధరను కేవలం రూ. 600గా నిర్ణయించాలనే ఆలోచన యూనిట్‌లో ఉన్నారట. అయితే ఇతర సినిమాలుకు పెంచినట్టుగా వెయ్యి రూపాయలు, రెండువేల రూపాయలు కాకుండా రిజనబుల్ గా పెంచటం సరైన నిర్ణయం. అలాగే మొదటి పది రోజులు సింగిల్ స్క్రీన్స్ లో రూ. 75 మల్టిప్లెక్స్ లో రూ. 100 పెంచేలా ఏపీ ప్రభుత్వానికి అనుమతులు అప్లై చేశారు మేకర్స్. రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ వేసేందుకు థియేటర్స్ తో అగ్రిమెంట్స్ పనులు కూడా ఫినిష్ చేశారు. ఈ ఏడాది ఆరంభంలో డాకు మహారాజ్ తో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య ఇప్పుడు రాబోతున్న అఖండ 2 తో బిగెస్ట్ హిట్ అందుకోబోతున్నాడు అనే టాక్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. బాలయ్య ఆస్థాన విద్వాంసుడు తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్ పై నిర్మించారు.