
Akhanda 2: నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘అఖండ 2 తాండవం’ కోసం సినీ ప్రేక్షకులు, నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌కు సూపర్ రెస్పాన్స్ రావడంతో బాలయ్య బాబు తాండవాన్ని థియేటర్లలలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
READ ALSO: Akhanda 2 Pre Release: “నందమూరి బాలుడాయ… దొమ్మలేమో అదిరిపాయా” పాట వెనకాల కథ ఇదే..!
ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం గ్రాండ్‌గా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా అభిమానుల కోసం మేకర్స్ సినిమా నుంచి మరో టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం పవర్ఫుల్ యాక్షన్‌తో ఉంది. ఇందులో బాలయ్య మార్క్ యాక్షన్‌తో చూపెట్టిన సీక్వెన్స్‌లను బోయపాటి కట్ చేసిన తీరు సూపర్‌గా ఉంది. ఈ టీజర్ చూస్తే థమన్ మరోసారి విశ్వరూపాన్ని చూపించబోతున్నట్లు అర్థం అవుతుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో కొత్త టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా రెట్టింపు చేసింది.