Akhanda 2: బాలయ్య మా బలం, మా శక్తి, మా ఆస్తి: బోయపాటి శ్రీను

Boyapati Sreenu Praises Balakrishna Akhanda 2 Event

Akhanda 2: అఖండ 2 తాండవం సినిమా ఈవెంట్‌లో చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను స్పీచ్‌తో అదరగొట్టాడు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇచ్చిన సహకారం వల్లే హైదరాబాదు నుంచి మోదుగూడం వరకు భయపడకుండా, అడ్డంకులు లేకుండా షూటింగ్ పూర్తి చేయగలిగాం అని వెల్లడించారు. బాలయ్య మా బలం, మా శక్తి, మా ఆస్తి అని అన్నారు.

READ ALSO: Akhanda 2: స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోండి.. థమన్ మాస్ వార్నింగ్

ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, సాంగి, చటర్జీలకు, మురళీ మోహన్‌లకు ఇతర ఆర్టిస్టులకు ధన్యవాదాలు తెలిపారు. తాను ఎమోషన్‌లో నడిచే సినిమాలను నమ్ముతాను, ఆ ఎమోషన్‌లోని యాక్షన్‌ను అందంగా రామ–లక్ష్మణ మాస్టర్స్, రాహుల్, రవివర్మ మాస్టర్ చూపించారని అన్నారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాలో నటించిన పూర్ణ కుటుంబ బాధ్యతల మధ్యలో కూడా అద్భుతంగా పనిచేశారని, అలాగే హర్షాలి ‘బజరంగీ భాయిజాన్’ తర్వాత 10 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో నటించిందన్నారు. తన పాత్రను ప్రేక్షకులు తప్పకుండా మెచ్చుకుంటారని చెప్పారు.

ఈ సినిమా సంగీత దర్శకుడు తమన్‌తో తన జర్నీ ‘సరైనోడు’ నుంచి ఇప్పటికీ కొనసాగుతోందని అన్నారు. ఆయన ఈ సినిమాకు ఇచ్చిన సౌండ్ చిత్ర విజయానికి అదనపు శక్తిగా మారుతుందన్నారు. సినిమా నిర్మాతలు రామాచంట, గోపి ఆచంట, కోటి తనకు ఇచ్చిన పూర్తి స్వేచ్ఛ వల్లే చిత్రం అద్భుతంగా వచ్చిందన్నారు. అఖండ 2 తాండవం సినిమాను చాలా కఠినమైన లొకేషన్లలో తీయగలిగాం అని, దేవుడి ఆశీస్సులతో షూట్ పూర్తయిందని చెప్పారు. భారతదేశం ప్రపంచానికి జ్ఞానం ఇచ్చిన దేశం అని, రామాయణం, భారతం, భగవద్గీత ఇచ్చిన దేశం అని, అలాంటి దేశాన్ని ఎవరైనా తాకితే, దేవుడు స్వయంగా స్పందిస్తాడని, ఆ దేవుడి రూపమే అఖండ అని బోయపాటి అన్నారు.

READ ALSO: Akhanda 2: పవర్‌ఫుల్ యాక్షన్‌తో ‘అఖండ 2 తాండవం’ కొత్త టీజర్..