Akhanda 2: స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోండి.. థమన్ మాస్ వార్నింగ్

Thaman Mass Warning At Akhanda 2 Event

Akhanda 2: అఖండ 2 తాండవం సినిమా ఈవెంట్‌లో తమన్ మాస్ స్పీచ్‌తో నందమూరి అభిమానులను అలరించారు. తమన్ మాట్లాడుతూ.. అఖండ ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు జీవితంలో పెద్ద హై వచ్చింది. అదే ఎనర్జీ, అదే పవర్ ఈ సారి కూడా మమ్మల్ని తాకింది. ఇది మ్యూజిక్ కాదు … ఈ సినిమాకు శివుడే పని చేయిస్తున్నాడు” అని ఆయన అన్నారు. ఈ సినిమాలో బాలయ్యను శివుడి రూపంలో చూస్తుంటే శరీరం గగుర్పొడుస్తోందన్నారు. 70mm లో ఆ పవర్ ఇంకా పది రెట్లు ఉంటుందని చెప్పారు. ఈ సారి తనపై ఎవరూ కంప్లైంట్ చేయొద్దని, స్పీకర్లు పాడైపోయాయ్, మైక్ ఆఫ్ అయిపోయిందంటే తాను బాధ్యత తీసుకోనని, అందుకే ముందే అన్ని సర్వీస్ చేసి పెట్టుకోవాలని అన్నారు.

READ ALSO: Akhanda 2: బోయపాటి ఎనర్జీ, బాలయ్య ప్యాషన్.. హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

జార్జియాలో క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరించే సమయంలో అక్కడ మైనస్ 4 డిగ్రీలు, గాలి గుచ్చుకుంటోంది.. కానీ బాలయ్య ఒక్కసారి కూడా కంఫ్లైంట్ చేయలేదని అన్నారు. ‘సీన్ పర్ఫెక్ట్‌గా రావాలి’ అనే ఒక్క మాట తప్ప ఆయన మరొక మాట కూడా అనలేదని చెప్పారు. ఆ కష్టాన్ని చూసి మా టీమ్ కూడా దాదాపు వణికిపోయిందని అన్నారు. బోయపాటి అందించే ఎనర్జీ.. అది డైరెక్టర్ పవర్ కాదు, దేవాలయ ఘంటల శబ్దం లాంటిది. ఈ సినిమాలో ఆయన ఇచ్చిన డైలాగ్ స్పేస్‌లో మ్యూజికల్‌గా చాలా కెర్‌ఫుల్‌గా వాడాల్సి వచ్చింది అని అన్నారు. లిరిక్ రైటర్స్ అందరూ అద్భుతంగా పనిచేశారని, ఒక్కో పదం కూడా శివుని ముందు పెట్టే నైవేద్యం లాగానే రాశాం అని అన్నారు.

ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అని ముందే ఎందుకు చెబుతున్నానంటే.. ఈ సినిమా శివుడి ఆశీర్వాదంతో తయారైంది. మా కష్టమే కాదు.. అది ఒక దైవ శక్తి. డిసెంబర్ 5న థియేటర్లలో మళ్లీ అఖండ హై మీరే చూస్తారు అని తమన్ అన్నారు. గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో బాలయ్యతో ఆరో సినిమా మొదలైందని, ఏడో చిత్రం కూడా త్వరలో మొదలవుతుందని తెలిపారు.

READ ALSO: Akhanda 2: పవర్‌ఫుల్ యాక్షన్‌తో ‘అఖండ 2 తాండవం’ కొత్త టీజర్..