Akhanda Roxx: ‘అఖండ 2’ సెన్సేషన్.. బాలయ్య పవర్ ఫుల్ ఇమేజ్ కు ప్రత్యేక వాహనం..!

Akhanda 2 Sensation Boayapati Launches Akhanda Roxx Vehicle For Balakrishna Powerful Role

Akhanda Roxx: మాస్ చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కలిస్తే బాక్సాఫీస్ వద్ద విజయం గ్యారంటీ అని చెప్పకనే చెప్పవచ్చు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలవగా.. తాజాగా వస్తున్న ‘అఖండ 2’ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార కంటెంట్ ఇప్పటికే అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

400% అల్ట్రా స్పీకర్, IP69 ప్రో రేటింగ్, 2 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ తో Realme C85 5G లాంచ్..!

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక అద్భుతమైన విషయం వైరల్ అవుతోంది. సినిమాలోని బాలకృష్ణ పాత్ర కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనం ‘అఖండ Roxx’ ను చిత్రబృందం గ్రాండ్‌గా లాంచ్ చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆయన కోర్ క్రియేటివ్ టీమ్‌తో కలిసి హాజరయ్యారు. XDrive అత్యాధునిక ఇంజినీరింగ్‌తో నిర్మించి, X Studios సినిమాటిక్ లుక్‌ను అందించిన ఈ వాహనం.. పవర్, మాస్ ఎనర్జీకి సర్రిగా సరిపోయేలా రూపుదిద్దుకుంది. హీరో నందమూరి బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్‌కు అద్దం పట్టేలా, కథనానికి సరిపోయే విధంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దారు.

Nirmala Sitharaman: అమరావతి నిర్మించటంలో రైతుల పాత్ర కీలకం.. దేశంలోనే ఇది మొదటిసారి!

ఈ సందర్భంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ఈ వాహనం డిజైన్ పట్ల తన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక పవర్ వున్న క్యారెక్టర్ దిగి వస్తుంటే దానికి తగ్గ ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో ఈ వెహికిల్ కూడా అంత పవర్ ఫుల్‌గా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా, ఈ వాహనాన్ని అద్భుతంగా డిజైన్ చేసిన అమర్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సుమారు నాలుగు రోజులు పగలు రాత్రి కష్టపడి గొప్పగా డిజైన్ చేసిన అమర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ వాహనాన్ని వెండితెరపై చూసినప్పుడు ఆడియన్స్ మెస్మరైజ్ అవుతారని.. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారని బోయపాటి శ్రీను అన్నారు. అంతేకాకుండా సినిమా గురించి చెబుతూ.. “అఖండ 2” అనేది కేవలం సినిమా మాత్రమే కాదు, ఇది భారతదేశపు ఆత్మ అని పేర్కొన్నారు. సినిమా చూశాక ఈ విషయం అర్థమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.