Akhanda2 : నటన అంటే నవ్వడమో.. కన్నీళ్లు తెప్పించడమో కాదు : నందమూరి బాలకృష్ణ

Acting Is Not About Making You Laugh Or Cry Nandamuri Balakrishna

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డిరెక్టన్ లో అఖండకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘అఖండ‌-2. ప్రగ్య జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అత్యంత భారీ బడ్జెట్ పై 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట‌-గోపీ అచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది అఖండ 2.

Also ReadOTT : ఓటీటీలో అదరగొడుతున్న సినిమాలు :

గడచిన రాత్రి అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో రిలీజ్ చేసిన అఖండ 2 యాక్షన్ ట్రైలర్ కు సూపర్బ్ స్పందన వచ్చింది. ప్రీ రిలీజ్ వేడుకలో బాలయ్య మాట్లాడుతూ ” నటన అంటే నవ్వడమో.. కన్నీళ్లు తెప్పించడమో కాదు. యాక్టింగ్ అంటే ఇంకో ఆత్మలోకి ప్రవేశించడం. నేను దేనికైనా సరే ఛాలెంజ్ అనే టైప్. పాదరసం ఎందులో పోస్తే ఆ ఆకారంలోకి మారుతుంది. నేను అంతే ఏ పాత్ర చేస్తే ఆ అపాత్ర ఆత్మలోకి ప్రవేశిస్తా. అది నా అదృష్టంగా భావిస్తా. నాకు ముఖ్యంగా రెండు ఉండాలి ఒకటి డిసిప్లిన్ రెండు ఆర్టిస్ట్ కు రెస్పెక్ట్ ఈ రెండు లేని చోట బాలకృష్ణ లేడు.  ఇటీవల మరో సినిమా మొదలు పెట్టాను గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో అందులో ఒక డైలాగ్ ఉంటుంది. చరిత్రలో చాలామంది ఉంటారు కానీ, చరిత్రను సృష్టించేవాడు ఒక్కడే ఉంటాడు. నేనే ఈ చరిత్ర .. నాదే ఆ చరిత్ర. నన్ను అర్ధం చేసుకుని, నా అభిమానులకు నచ్చే విదంగా సినిమాలు తీసే దర్శకులు ఇప్పుడు నాతో ఉన్నారు. అది కూడా అదృష్టంగానే భావిస్తాను. గతంలో సినిమాలు విషయంలో తప్పిదాలు చేశాను ఇక అలా జరగదు. ; అని అన్నారు.