Akshay Khanna : ఈ ఏడాది కూడా ఫైనెస్ట్ యాక్టర్‌గా మరోసారి ప్రూవ్ చేసుకోబోతున్న స్టార్ హీరో

The Star Hero Is Set To Prove Himself As The Finest Actor Once Again This Year

ఛావా సినిమాలో ఔరంగజేబ్‌గా అక్షయ్ ఖన్నా తన పీక్ పెర్ఫార్మెన్స్‌ చూపించాడు. చరిత్రలో క్రూరుడిగా నిలిచిన ఔరంగజేబ్ ఇమేజ్‌ని స్క్రీన్ మీద రియలిస్టిక్‌గా ఆవిష్కరించాడు. పాత్రలోని అహంకారం, పొలిటికల్ స్ట్రాటజీస్, ఎమోషనల్ షేడ్స్ అన్నీ కలిపి ఆయన లుక్‌లో బలంగా ప్రతిబింబించాయి. ఈ నెగటివ్ రోల్ ఆయన వెర్సటైల్ యాక్టింగ్‌కి మరో హైలైట్‌గా నిలిచింది.

Also Read : Urvashi : దబిడి.. దిబిడి బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ కరువు

పాకిస్తాన్ టెర్రరిజాన్ని రూపుమాపేందుకు ఇండియన్ రా ఏజెన్సీ చేస్తున్న ఆపరేషన్ ధురందర్లో అక్షయ్ ఖన్నా డెకాయిట్ రెహ్మాన్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన లుక్ ఇప్పటికే ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసింది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈయన క్యారెక్టర్ పూర్తిగా క్రూరమైన లుక్‌లో, డిఫరెంట్ షేడ్స్‌తో డిజైన్ చేశారు. ఈ రోల్‌లో అక్షయ్ బాడీ లాంగ్వేజ్, సైలెంట్ యాక్టింగ్, ఎమోషన్స్ కంట్రోల్ అన్నీ హైలైట్ అవుతాయని యూనిట్ చెబుతోంది. తన కెరీర్‌లో మరో క్లాసీ మైలురాయిగా ఈ సినిమా నిలవబోతుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. ప్రశాంత్ వర్మ రైటింగ్ తో వస్తున్న మహాకాళి సినిమాలో అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ రోల్‌లోని పవర్, మిస్టరీ, ఫిలాసఫీ అన్నీ కలిపి ఆయన లుక్ చాలా డివైన్‌గా, ఇంటెన్సిటి క్రియేట్ చేసేలా ఉంది. తాల్ సినిమాలో ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో నటించిన అక్షయ్ ఖన్నా లాంటి హీరో.. రేస్ నుంచి విలన్ గా మారి, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తోన్న ఆయన డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ లో కూడా నటిస్తున్నాడు. పురాణ గాథల్లో శుక్రాచార్యుడి స్థానం ఎంత ముఖ్యమో, అదే గ్రావిటీని స్క్రీన్ మీద అక్షయ్ ఖన్నా తీసుకురాబోతున్నాడని ఇండస్ట్రీ టాక్. మైథాలజీ డ్రామాకి ఆయన పెర్ఫార్మెన్స్ కొత్త లేయర్ జోడించబోతుందనే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.