Alchohal : ‘ఆల్కహాల్‌’ కోసం వెనకడుగు వేస్తున్న అల్లరి నరేష్..?

Allari Naresh Alcohol Release Postponement Latest Update

హీరో అల్లరి నరేష్ ఇటీవల నటించిన ‘12A రైల్వే కాలనీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో, ఈ చిత్రం ప్రభావం ఆయన తదుపరి సినిమా ‘ఆల్కహాల్’ పై పడుతున్నట్లు ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి. నాని కాసరగడ్డ దర్శకత్వంలో, అనిల్ విశ్వనాథ్ షో రన్నర్‌గా రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, నరేష్ కెరీర్‌కు అది చిన్న జోల్ట్ గా మారింది. ఇక ఆయన నటిస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘ఆల్కహాల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ సృష్టించింది. మెహర్ తేజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ డార్క్ క్రైమ్ థ్రిల్లర్ జనవరి 1, 2026న విడుదల కానుందని ముందుగా యూనిట్ ప్రకటించింది.

Also Read : Spirit : స్పిరిట్‌లో బోల్డ్ బ్యూటీ .. స్పెషల్ సాంగ్‌తో పాటు కీలక పాత్ర !

అయితే, ‘12A రైల్వే కాలనీ’ ఫలితం నేపథ్యంలో, ఆల్కహాల్ సినీ టీమ్ ఇప్పుడు రిలీజ్‌ను వాయిదా వేయాలా అన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కథా నాణ్యత, ప్రమోషన్, మార్కెటింగ్ విషయంలో మరింత బలం పెంచుకునేందుకు కొంత సమయం తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ చిత్రంలో రుహాని శర్మ, నిహారిక ఎన్ఎమ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే రిలీజ్ వాయిదా పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిజంగానే ‘ఆల్కహాల్’ పొస్ట్‌పోన్ అవుతుందా? లేక నిర్ణయాన్ని మార్చుకుంటారా? అనేది మరికొన్ని రోజుల్లో స్పష్టమవుతుంది.