
కోలీవుడ్‌లో సంచలనం రేపిన ‘పిశాచి 2’ న్యూడ్ పోస్టర్‌పై హీరోయిన్ ఆండ్రియా జెరెమియా స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, సినిమా షూటింగ్ నుంచి వివాదాస్పద పోస్టర్ వరకు ఎన్నో కీలక విషయాలను వెల్లడించారు. ఆండ్రియా ‘పిశాచి 2’ షూటింగ్ చాలా కాలం క్రితం పూర్తయినా, పలు కారణాల వల్ల ఇప్పటి వరకు విడుదల కాలేదు. మిస్కిన్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్‌లో, ప్రారంభ చర్చల సమయంలోనే టీమ్ ఓ బోల్డ్ సీన్ గురించి ఆమె చెప్పింది. కథాచర్చల సమయంలో ఆ సన్నివేశం గురించి ఓ నిర్ణయానికి వచ్చినా, అసలు షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఆ సీన్‌ను పూర్తిగా తొలగించారని వెల్లడించారు.
Also Read : Aishwarya Rajinikanth : ఆయన సహాయానికి ఎప్పటికీ రుణపడి ఉంటా..
అయితే సినిమా కోసం విడుదలైన పోస్టర్‌లో ఆమె నగ్నంగా పోజిచ్చిందన్న విమర్శలపై ఆమె క్లారిటీ ఇచ్చింది. “పిశాచి 2 కోసం నేను ఎలాంటి న్యూడ్ సన్నివేశాల్లోనూ నటించలేదు. ఆ సినిమాలో ఎవ్వరూ అలాంటి సీన్లు చేయలేదు,” అని ఆండ్రియా స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ పోస్టర్‌కు సినిమాతో నేరుగా సంబంధం లేదని సూచించింది. అంతేకాదు, సినిమా కథ ప్రకారం కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికీ అవి న్యూడిటీ తో సంబంధం లేని విధంగా, కథకు అవసరమైనంత మాత్రమే ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.