
AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే జీవో ద్వారా ఇద్దరు ముఖ్య కార్యదర్శుల నియామకాలను ప్రకటించింది. ఈ నిర్ణయం రాష్ట్ర పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ప్రస్తుత సీఎస్ విజయానంద్‌కు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) నుంచి మరో మూడు నెలల పాటు పదవిని పొడిగిస్తున్నట్లు లేఖ రాసింది. దీంతో విజయానంద్ డిసెంబర్ 1, 2025 నుంచి 2026 ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆయన సేవలు కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Read Also: RITES Recruitment 2025: RITES లిమిటెడ్‌లో భారీగా అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. మంచి జీతం
ఇక, రాష్ట్రంలో కొత్త ముఖ్య కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్‌ను ఎంపిక చేసినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. పరిపాలనా బాధ్యతల బదిలీ, ముఖ్య నిర్ణయాలు అమలు, పాలనలో సమన్వయం కోసం ఈ డ్యూయల్- సీఎస్ విధానం చేపట్టినట్లు సమాచారం. విజయానంద్‌కు పదవిని పొడిగించడంతో పాటు కొత్త సీఎస్‌ను నియమించడం ద్వారా రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలో మార్పులు జరగనున్నట్లుగా భావిస్తున్నారు. భవిష్యత్ పరిపాలనా దృష్ట్యా ప్రణాళికలు, ప్రభుత్వ కీలక ప్రాజెక్టులకు వేగం పెంచడమే ముఖ్యంగా పెట్టుకుంది.