AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం!

Ap Liquor Scam Key Twist As A2 Vasudeva Reddy And A3 Satyaprasad Seek Anticipatory Bail In High Court

ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ3 సత్యప్రసాద్‌లు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో ఏసీబీ కోర్టులో ఈ ఇద్దరు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేయగా.. కోర్టు డిస్మిస్ చేయటంతో హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో ఈ ఇద్దరికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దని కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం ఏపీ హైకోర్టు విచారణ చేయనుంది.

Also Read: Daily Horoscope: శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!

వాసుదేవ రెడ్డి, సత్యప్రసాద్‌లు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే అది ట్రయల్ పై ప్రభావం చూపుతుందని ఇంప్లీడ్ పిటిషన్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ వీరికి మంజూరు చేస్తే.. సాక్ష్యాలను తారు మారు చేసి సాక్షులను బెదిరిస్తారన్నారు. ఎక్సైజ్ శాఖలో కీలక బాధ్యతలు వ్యవహరించిన ఈ ఇద్దర్ని ట్రయల్ ముగిసే వరకు కస్టడీలో ఉంచాలని చెవిరెడ్డి కోరారు.