Aunty Viral Dance: పెళ్లి వేడుకలో డ్యాన్స్‌తో అదరగొట్టిన ఆంటీ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో!

Aunty Viral Dance Wedding Video Social Media

Aunty Viral Dance: పెళ్లి వేడుక అంటే.. ఆ మండపంలో ఉండే సందడి, ఆహ్లాదకరమైన వాతావరణం మామూలుగా ఉండదు. ఒక వేళ అక్కడ వాతావరణం సప్పగా ఉంటే.. వరుడి తరుఫు వారో, లేదంటే వధువు బంధువులో క్షణాల్లో అక్కడి వాతావరణాన్ని సందడిగా మార్చుతుంటారు. అచ్చంగా అలాంటి సంఘటననే ఈ వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూడా ‘మూడ్-ఛేంజర్’ గా మారిన ఒక ఆంటీ వైరల్ డ్యాన్స్ వీడియో కనిపిస్తుంది. ఆ ఆంటీ ఓ పాట బీట్ విన్న వెంటనే, ఫ్లోర్‌పై వైరల్ స్టెప్పులతో సూపర్ డ్యాన్స్ చేశారు.. ఆ డ్యాన్స్‌ను ఈ వీడియోలో చూడవచ్చు.

READ ALSO: Uzbekistan: ఈ ముస్లిం దేశంలో ఏక కాలంలో 2 వేల మసీదులలో ప్రార్థనలు.. దీని కోసమేనా!

ఈ వీడియోను @wedus.in ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది. ఈ క్లిప్ ప్రారంభం కాగానే, DJ పంజాబీ బీట్‌లో పాట సాగుతుంటే ఆ ఆంటీ ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా, సూపర్ డ్యాన్స్ మూమెంట్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వీడియో ఆమె కనిపించినంత సేపు ఎక్కడ కూడా ఆమెలో ఆత్మవిశ్వాసం కొంచెం కూడా తగ్గినట్లు కనిపించలేదు” ఈ పెళ్లిలో ఆంటీ డ్యాన్స్ ప్రదర్శనే హైలెట్ అని అక్కడికి వచ్చిన చాలా మంది చెప్పారు. ఈ వీడియో మొత్తంలో ఆ ఆంటీ కదలికలను గమనిస్తే ప్రతి ఒక్కటి చాలా సరదాగా, ఉత్సాహంగా చేసిన స్టెప్పులే కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.

READ ALSO: NBK 111 Mass Dialogue: బాలయ్య బేస్ వాయిస్‌లో ఊర మాస్ డైలాగ్ లీక్..