Awantipora Operation: భారత్‌లో జైషే ఉగ్రస్థావరం ధ్వంసం.. ఒకరి అరెస్ట్

Jaish E Mohammed Hideout Busted In India Arrest Made

Awantipora Operation: అవంతిపోరా పోలీసులు ఉగ్రవాద నిరోధక చర్యలో గణనీయమైన పురోగతి సాధించారు. ఈసందర్భంగా పోలీసులు జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని ఛేదించారు. భద్రతా దళాలతో కలిసి అవంతిపోరా పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఉగ్రవాద సంస్థకు సహాయం చేసే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. దేశంలో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నిర్మూలించడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా విశ్లేషకులు చెబుతున్నారు.

READ ALSO: HMDA : కోకాపేట భూముల రికార్డుల పరంపర.. ఎకరా 151 కోట్లు..!

నానార్ మీదుర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు అవంతిపోరా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు 42 రాష్ట్రీయ రైఫిల్స్, CRPF 180వ బెటాలియన్‌తో కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఆ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముట్టి సోదాలు ప్రారంభించారు. ఈ సోదాల్లో జైష్-ఎ-మొహమ్మద్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాద సహచరుడు నజీర్ అహ్మద్ గనాయ్‌ను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. అరెస్ట్ అయిన వ్యక్తి నానార్‌లోని గనాయ్ మొహల్లా నివాసి. నిందితుడు పోలీసుల విచారణ తర్వాత ఒక తోటలో ఉన్న ఉగ్రవాద స్థావరం గురించి సమాచారం అందించాడు. భద్రతా దళాలు వెంటనే ఆ స్థావరాన్ని గుర్తించి ధ్వంసం చేశాయి.

ఈ రహస్య స్థావరం వద్ద భద్రతా దళాలు రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక డిటోనేటర్, ఒక పేలుడు పదార్థం లాంటి వస్తువును స్వాధీనం చేసుకున్నాయి. భద్రతా దళాలు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సమక్షంలో ఈ రహస్య స్థావరాన్ని ధ్వంసం చేశాయి. అరెస్టయిన నజీర్ అహ్మద్ గనాయ్ త్రాల్, అవంతిపోరా ప్రాంతాలలో పనిచేస్తున్న జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులకు చురుకుగా సహాయం చేశాడని దర్యాప్తులో తేలింది. నిందితుడు వారికి లాజిస్టిక్స్, ఆయుధాలు, మందుగుండు సామగ్రి రవాణాలో సహాయం చేశాడని తేలింది. తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.

READ ALSO: NTR – Prashanth Neel: ఎన్టీఆర్-నీల్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్..