Bank Holidays in December 2025: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. డిసెంబర్ నెలలో సగం కంటే ఎక్కువ రోజులు బ్యాంకులు బంద్

Banks Will Be Closed For 18 Days In December

రెండ్రోజుల్లో నవంబర్ నెల ముగియనున్నది. సంవత్సరంలో చివరి నెల అయిన డిసెంబర్ ప్రారంభం కానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ హాలిడేస్ ప్రకటించింది. ఈ నెలలో బ్యాంకులు 18 రోజులు మూసి ఉండనున్నాయి. ఇందులో ప్రభుత్వ సెలవులు, ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు కూడా ఉన్నాయి. అంటే సగం రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టీ మారుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి. వచ్చే నెలలో సెలవులు ఏ రోజుల్లో ఉన్నాయో ముందే తెలుసుకుంటే సమయం ఆదాతో పాటు పనుల్లో జాప్యాన్ని కూడా నివారించుకోవచ్చు. బ్యాంకు సెలవులు ఉన్నప్పటికీ, మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్ (UPI, IMPS, NEFT, RTGS), ATMల ద్వారా మనీ ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు లేదా ఇతర పనులు చేసుకోవచ్చు.

Also Read:Annagaru Vostaru: కార్తీ కొత్త సినిమా ‘అన్నగారు వస్తారు’ టీజర్ రిలీజ్.. చూశారా..?

డిసెంబర్ నెలలో బ్యాంక్ సెలవుల లిస్ట్

డిసెంబర్ 1 (సోమవారం) – అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇటానగర్, కోహిమాలో అన్ని బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 3 (బుధవారం) – సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ సందర్భంగా గోవాలోని పనాజీలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 7 (ఆదివారం) – దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు ఆదివారం బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 12 (శుక్రవారం) – పా టోగన్ సంగ్మా వర్ధంతి సందర్భంగా షిల్లాంగ్‌లోని అన్ని బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 13 (శనివారం) – రెండవ శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 14 (ఆదివారం) – దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు ఆదివారం బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 18 (గురువారం) – ఉ సోసో థామ్ వర్ధంతి సందర్భంగా షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 19 (శుక్రవారం) – గోవా విమోచన దినోత్సవం సందర్భంగా పనాజీలోని బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 20 (శనివారం) – లోసుంగ్ పండుగ సందర్భంగా గాంగ్‌టాక్‌లోని బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 21 (ఆదివారం) – దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు ఆదివారం బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 22 (సోమవారం) – నామ్సంగ్ పండుగ కారణంగా గ్యాంగ్‌టాక్‌లో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 24 (బుధవారం) – ఐజ్వాల్, కోహిమా, పనాజీ, షిల్లాంగ్, పూణేలోని కొన్ని ప్రాంతాలలో క్రిస్మస్ ఈవ్ సందర్భంగా బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 25 (గురువారం) – క్రిస్మస్ ఈవ్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 26 (శుక్రవారం) – ఐజ్వాల్, కోహిమా, షిల్లాంగ్‌లోని బ్యాంకులు క్రిస్మస్ ఈవ్ సందర్భంగా బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 27 (శనివారం) – దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు నాల్గవ శనివారం బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 28 (ఆదివారం) – ఆదివారం అన్ని బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 30 (మంగళవారం) – ఉ కియాంగ్ నంగ్బా వర్ధంతి సందర్భంగా షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 31 (బుధవారం) – ఢిల్లీ, పూణే, పనాజీ, షిల్లాంగ్, ఐజ్వాల్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో బ్యాంకులు నూతన సంవత్సర వేడుకల బ్యాంకులకు సెలవు.