
Bhatti Vikramarka: 2047 వరకు మూడు ట్రిలియన్ల ఎకానమీకి చేరుకోవాలనేది లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అందుకు కావలసిన పెట్టుబడులకు అవసరమైనది విద్యుత్ అన్నారు. అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి ప్లానింగ్ చేస్తున్నాం.. పవర్ డిమాండ్ రాష్ట్రంలో పదేళ్లుగా పెరుగుతుందని తెలిపారు. తాజాగా ప్రజా భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.. 2014 నుంచి విద్యుత్తు 14.2 డిమాండ్ గ్రోత్ ఉందన్నారు.. 2020- 2021 నుంచి 5.44 గ్రోత్, 2024- 25లో 9.8 శాతం గ్రోత్ కనిపించిందని వెల్లడించారు. 2025 నుంచి 34, 35 వరకు తెలంగాణలో 6.4 గ్రోత్ ఉండే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
READ MORE: Dies-Irae OTT Release: ఓటీటీ డేట్ లాక్ చేసిన మలయాళ హారర్ హిట్ ‘డీయస్ ఈరే’.. కానీ ట్విస్ట్ ఏంటంటే..
మూసి ప్రక్షాళన.. ఫ్యూచర్ సిటీ.. పెట్టుబడుల ఒప్పందం.. పరిశ్రమలు.. డేటా సెంటర్లతో హైదరాబాద్ గ్లోబల్ హబ్‌గా మారబోతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. “8.50 గ్రోత్ ఉండబోతుంది.. 2047 కి లక్ష 39 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం.. తెలంగాణలో 2026 ఏప్రిల్ నాటికి 24769 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంది.. వాడే విద్యుత్తులో 50 శాతం గ్రీన్ ఎనర్జీ వాడాలి.. ఎనర్జీ స్టోరేజ్ ప్లాన్ గతంలో లేదు.. పదేళ్ల క్రితం ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది.. అవసరాలకు అనుగుణంగా ఎనర్జీ స్టోరేజ్ ప్లానింగ్ లేదు.. గ్రీన్ పవర్ ఎనర్జీ స్టోరేజ్‌కి తెలంగాణ అనుకూలం.. పదేళ్లుగా ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు.. కానీ ఏపీ మొదలుపెట్టింది.. తెలంగాణలో మాత్రం ఆ ప్రయత్నమే లేదు.. థర్మల్ పవర్ కంటే.. గ్రీన్ ఎనర్జీ వస్తుంది.. కానీ తెలంగాణ అందుకోలేక పోయింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత.. డిలైట్ లాంటి వాళ్ళను నివేదిక ఇవ్వండి అని అడిగాం.. ఒక్కరోజు బ్లాక్ ఔట్ అయితే 1500 నుండి 2000 కోట్లు నష్టపోతం.. ” అని వెల్లడించారు.
READ MORE: Delhi Car Blast: 3 పెళ్లిళ్లు.. ఇద్దరు పిల్లలు.. వెలుగులోకి షాహీన్ ప్రేమకథ!