BJP: ఎన్నికలకు ఒక రోజు ముందు, బీజేపీలో చేరిన ఆప్ కీలక నేత..

Rajesh Gupta Quits Aap Joins Bjp Before Mcd Bypolls

BJP: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD)లో ఉప ఎన్నికలకు ఒక రోజు ముందు కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో రెండుసార్లు ఎమ్మెల్యే, పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజేష్ గుప్తా బీజేపీలో చేరారు. దీంతో,ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా సమక్షంలో గుప్తా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ వీడటానికి గల కారణాలను వెల్లడిస్తూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

Read Also: Khaleda Zia: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని పరిస్థితి విషమం.

‘‘అన్నా హజారే ఆందోళన సమయంలో ఉద్యోగాలు వదిలి వచ్చిన వారిని ఇప్పుడు ఆప్ పట్టించుకోవడం లేదు. చాలా మంది ఆప్‌ను వదిలి వెళ్లాలని అనుకుంటున్నారు. ఆప్ కార్యకర్తల్ని వాడుకుని వదిలేస్తోంది’’ అని ఆరోపించారు. తాను చాలా ఏళ్లుగా పార్టీకి చేసిన కృషికి, పనికి ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గౌరవం ఇవ్వలేదని అన్నారు. తాను పార్టీ, దేశం మధ్య ఎంచుకోవాల్సిన పరిస్థితుల్లో దేశాన్ని ఎంచుకున్నానని గుప్తా అన్నారు. అయితే, ఆయన పార్టీ వీడటంపై ఆప్ ఇంత వరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. నవంబర్ 30న ఖాళీగా ఉన్న 12 వార్డులకు ఉప ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఈ చేరిక బీజేపీకి బూస్ట్ ఇచ్చింది.