Off The Record: కవితకు బీఆర్ఎస్ కౌంటర్స్.. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..?

Off The Record: తగ్గేదేలే…. ఇక మాటల్లేవ్‌…. మాట్లాడుకోవడాల్లేవ్‌…. అన్నీ పోట్లాడుకోవడాలేనని అంటున్నారట బీఆర్‌ఎస్‌ నాయకులు. కేసీఆర్‌ కుమార్తెగా గౌరవించి ఇన్నాళ్ళు కామ్‌గా ఉన్నామని, ఇక మాటకు మాట సమాధానం చెబుతామని అంటున్నారు. పార్టీ హై కమాండ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడమే అందుకు కారణమని తెలుస్తోంది. జాగృతి జనం బాట పేరుతో ప్రస్తుతం రాష్ట్ర పర్యటనలో ఉన్న కవిత…. తాను వెళ్ళిన ప్రతిచోట స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులను, ప్రత్యేకించి మాజీ మంత్రులను టార్గెట్‌ చేస్తున్నారు. అధికార … Read more

Off The Record: మీనాక్షి నటరాజన్ వైఖరిపై గాంధీ భవన్ లో గుసగుసలు..!

Off The Record: ఆదర్శంగా ఉండాలని అనుకోవడంలో తప్పు లేదు. గాంధీ సిద్ధాంతాలను ఫాలో అవడం గురించి అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఆ విషయంలో ఎవ్వరికీ అభ్యంతరాలు ఉండకూడదు కూడా. కానీ… తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ తీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా ఉందంటూ ఆ పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే…. ఆమె వ్యవహార శైలి కొరకరాని కొయ్యలా మారిందన్న చర్చ నడుస్తోంది గాంధీభవన్‌లో. స్థానిక నాయకులతో సంబంధం … Read more

Off The Record about: అన్ని పంచాయతీల్లో బీజేపీ పోటీ.. అంత సీన్ ఉందా..?

Off The Record about: తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పోటీ చేస్తామని చెబుతోంది బీజేపీ. సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్స్‌గా పోటీ చేయమంటూ స్థానిక నేతలకు ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడే ఒక కొత్త చర్చ మొదలైంది పార్టీ వర్గాల్లో. పైవాళ్ళు ఆదేశాలు ఇవ్వడం వరకు బాగానే ఉందిగానీ… కింది స్థాయిలో అసలు మనకంత సీన్‌ ఉందా అని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. ఆశ ఉండవచ్చుగానీ… దురాశ, పేరాశల్లాంటివి పనికిరావుకదా అంటూ వాళ్ళలో వాళ్ళే సెటైర్స్‌ వేసుకుంటున్నారట. … Read more