
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ఏదైనా సమాచారం కోసం ఏఐని సంప్రదించే వారి సంఖ్య పెరిగిపోయింది. అయితే కొన్ని సందర్భాల్లో లేని చిక్కులను కొని తెచ్చుకుంటున్నారు. గతంలో ఓ టీనేజర్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై ఓపెన్ ఏఐ స్పందించింది. టీనేజర్ ఆత్మహత్య కేసులో ఆరోపణలను ఖండించింది. కాలిఫోర్నియాలోని రాంచో శాంటా మార్గెరిటాకు చెందిన ఆడమ్ రెయిన్ అనే 16 ఏళ్ల బాలుడు ఈ సంవత్సరం ఏప్రిల్ 11న ఆత్మహత్య చేసుకున్నాడు. రెయిన్ చాట్‌జిపిటిలో గంటల తరబడి గడిపాడని, చాట్‌బాటే అతన్ని ఆత్మహత్యకు ప్రేరేపించిందని రెయిన్ తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే, కంపెనీ తాజాగా ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. యువకుడి మరణానికి చాట్‌జిపిటి బాధ్యత వహించలేదని పేర్కొంది.
Also Read:ప్రపంచంలోనే తొలి 8300mAh బ్యాటరీ ఫ్లాగ్‌షిప్‌గా OnePlus Ace 6T డిసెంబర్ 3న లాంచ్..!
తొమ్మిది నెలల కమ్యూనికేషన్ సమయంలో, మానసిక ఆరోగ్య సహాయం కోరమని, కౌన్సెలర్‌తో మాట్లాడాలని, హెల్ప్‌లైన్‌ను సంప్రదించమని ChatGPT ఆడమ్‌కు వందకు పైగా సలహాలు ఇచ్చిందని OpenAI చెబుతోంది. కంపెనీ ప్రకారం, ChatGPT ఆత్మహత్యను ప్రోత్సహించడానికి ఉద్దేశించింది కాదు. అటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు సూసైడ్ ను ప్రేరేపించే సలహాలు ఇవ్వదని తెలిపింది.
దీనిపై, ఐడాన్ రైన్ కుటుంబం మాట్లాడుతూ, భద్రతను ఉల్లంఘించిన తర్వాత, చాట్‌జిపిటి ఆత్మహత్యకు సంబంధించిన వివరణాత్మక పద్ధతులను ఆడమ్‌కు చెప్పిందని చెప్పారు. ఆత్మహత్య ఎలా చేసుకోవాలో చెప్పిందని ఆరోపించారు. మాదకద్రవ్యాల అధిక మోతాదు, మునిగిపోవడం, కార్బన్ మోనాక్సైడ్ తీసుకోవడం వంటి ఆప్షన్స్ ను కూడా చాట్ జీపీటి టీనేజర్ ముందు ఉంచింన్నారు. మొత్తం ప్రణాళికను అందమైన ఆత్మహత్యగా పేర్కొంటూ చాట్‌జిపిటి అతన్ని ప్రోత్సహించిందని తల్లిదండ్రులు ఆరోపించారు. దీని తరువాత, అతను సూసైడ్ నోట్ రాయడానికి ముందుకొచ్చాడు. ఇది నా బిడ్డను మానసికంగా బలహీనపరిచిందని పేరెంట్స్ తెలిపారు.
Also Read:Donald Trump: “మూడో ప్రపంచ దేశాల” నుంచి వలసల్ని అనుమతించం.. భారత్ ఈ జాబితాలో ఉందా.?
యూజర్ నిబంధనలు, షరతులను ఉల్లంఘించారని, హెచ్చరికను విస్మరించారని కంపెనీ వాదించింది. అందుకే ఇది జరిగిందని తెలిపింది. ఓపెన్ AI ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా బాధిత కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేసింది. కానీ దావాలో చేసిన ఆరోపణలు అసంపూర్ణమైనవిగా పేర్కొంది. బాధిత కుటుంబ న్యాయవాది మాట్లాడుతూ కంపెనీ జవాబుదారీతనం నుండి తప్పించుకుంటోందని కుటుంబ న్యాయవాది జే అడెల్సన్ అన్నారు. సరైన పరీక్ష లేకుండా GPT40ని మార్కెట్లోకి ప్రవేశపెట్టారనే ఆరోపణలపై కంపెనీ ఇప్పటికీ మౌనంగా ఉంది. ఆడమ్ మరణానికి ముందు అతని చివరి చాట్ చరిత్ర, ChatGPT అతన్ని ప్రోత్సహించిందని ఆరోపించిన చరిత్రకు కంపెనీ వద్ద స్పష్టమైన సమాధానం లేదని న్యాయవాది చెప్పారు.