
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సంబరాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఏకగ్రీవాలు మిన్నంటాయి. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఊర్లో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. సీఎం సొంతూరు నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సర్పంచ్‌గా మాజీ మావోయిస్టు, మల్లేపాకుల వెంకటయ్య (అలియాస్ మోహన్)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా ఈ విషయంలో చొరవ తీసుకుని గ్రామస్థులతో చర్చించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి, సర్పంచ్ పోటీకి అనేక మంది ఉత్సాహం చూపారు. అయితే.. చివరకు సీఎం చొరవతో గ్రామాభివృద్ధికి పాటుపడతారనే ఏకైక లక్ష్యంతో గ్రామస్థులంతా ఏకమయ్యారు. వెంకటయ్యను ఏకగ్రీవంగా అంగీకరించారు.
READ MORE: Rajendra Prasad: మరోసారి నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. బ్రహ్మానందం పై బోల్డ్ కామెంట్!
అయితే.. వెంకటయ్యా మాజీ మావోయిస్టు.. 1972లో కొండారెడ్డిపల్లిలో జన్మించిన ఆయన 1994లో గ్రామంలో మావోయిస్టులు పార్టీలో చేరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, గంగన్న, పాన్‌గల్ దళాలలో ర2000 సంవత్సరం వరకు చురుగ్గా పనిచేశారు. ఉద్యమంలో ఉన్నప్పుడే.. 1999లో నల్గొండ జిల్లా డిండి మండలం వాయిల్‌కోల్‌కు చెందిన మేనమామ కుమార్తె అరుణను ఆయన వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, 2001లో వెంకటయ్య హింసా మార్గాన్ని విడిచిపెట్టి, కల్వకుర్తి పోలీసుల సమక్షంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. అనంతరం.. 2023లో కల్వకుర్తి పోలీసు స్టేషన్‌లోనే హోంగార్డుగా ఎంపికయ్యారు. దాదాపు 20 ఏళ్లకు పైగా పని చేశారు.
READ MORE: Gautam Gambhir-BCCI: స్వదేశంలో రెండు వైట్‌వాష్‌లు.. గంభీర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం!