
CPI Narayana: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతా తెలివి తేటలు ఉన్న ఇమ్మడి రవి అలా మారడానికి కారణం ఈ వ్యవస్థ లే.. ఐ బొమ్మలో సినిమాలను ఫ్రీగా నేను కూడా చూశానని తెలిపారు. ఆరేడు వందలు పెట్టి ఎలా చూసేది అని చూశాను.. వ్యవస్థలో లోపాలను సరి చేయకుంటే ఇలాంటి రవిలే పుట్టుకు వస్తారని చెప్పుకొచ్చారు. ఒకరు మంచి చేస్తే మరొకరు చెడు చేస్తారు అని సీపీఐ నారాయణ చెప్పుకొచ్చారు.
Read Also: Election Commission: ఓటర్ల జాబితా సవరణకు 7 రోజులు పొడిగింపు..
ఇక, ఒక హిడ్మాను చంపితే వెయ్యి మంది హెడ్మాలు పుడుతారు అని నారాయణ పేర్కొన్నారు. అలానే ఒక బొమ్మ రవిని చంపితేనో, జైల్లో వేస్తేనో మరో 100 మంది వస్తారని తెలిపారు. ఐ బొమ్మ రవినీ ఉరి తీస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు.. సినిమా మాఫియాను ఉరి తీస్తే సమాజానికి ఉపయోగం ఉంటుంది అన్నారు. కోట్లు ఖర్చు పెట్టి టికెట్ ధరల కోసం ఆడుక్కుంటారని విమర్శించారు. సామాన్య ప్రజలను దోచుకోవడానికి ఈ ప్రభుత్వం సహాయం చేస్తుందా? అని అడిగారు.
Read Also: IND vs SA Playing 11: భారత్‌దే బ్యాటింగ్.. రిషబ్ పంత్‌కు షాక్!
అయితే, ఈ వ్యవస్థనే ఐ- బొమ్మ రవి అలా కావడనికి కారణం అని సీపీఐ నారాయణ అన్నారు. ఈ రవి పోతే మరో 100 మంది వస్తారని పోలిసులే చేబుతున్నారు.. వ్యవస్థీకృత లోపాలను సరి చేసుకోవాలి.. కోట్లాది రూపాయలు దోచుకుంటున్న వారిని ఐ-బొమ్మ రవి దెబ్బ కొట్టారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటే హిడ్మా, రవి లాంటి వారు పుడుతునే ఉంటారని నారాయణ వెల్లడించారు.