Cyclone Ditwah: తమిళనాడులో దిత్వా తుఫాను బీభత్సం.. స్కూ్ళ్లు, కాలేజీలు మూసివేత

Cyclone Ditwah Wreaks Havoc In Tamil Nadu

దిత్వా తుఫాన్ తమిళనాడులో బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తుఫాను ఆదివారం తెల్లవారుజామున ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం పుదుచ్చేరికి దక్షిణ-ఆగ్నేయంగా 300 కి.మీ. చెన్నైకి దక్షిణంగా 400 కి.మీ దూరంలో ఉంది. ఇక తీరం వెంబడి గాలుల వేగం గంటకు 50-60 కి.మీ నుంచి గంటకు 70 కి.మీ. వరకు ఉండనుంది. ప్రస్తుతం సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తుఫాన్ దగ్గర పడడంతో చెన్నై విమానాశ్రయం 54 విమానాలను రద్దు చేసింది. రాబోయే 48 గంటల్లో అత్యంత భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో రద్దుచేశారు. ఇక తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు మూసేశారు.

ఇది కూడా చదవండి: Siddarmaiah: అంతా మీడియా సృష్టే.. డీకేతో విభేదాలు లేవన్న సిద్ధరామయ్య

ఇక శ్రీలంకలో దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వరదలు, కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటికే 123 మంది చనిపోయారు. మరో 34 మంది ఆచూకీ గల్లంతైంది. ఇక శ్రీలంకకు భారతదేశం మానవతా సాయం అందించింది. ప్రత్యేక కార్గో విమానాల్లో సహాయ సామాగ్రిని పంపించారు.

ఇది కూడా చదవండి: Gold Rates: వామ్మో.. మగువలకు బిగ్ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!