
Deputy CM Pawan Kalyan visit: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలులో ఈ మధ్యే జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు.. అయితే, పవన్ కల్యాణ్ పర్యటనలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడం కలకలం రేపింది.. దీనిపై జనసేన నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజోలు పర్యటనలో అనుమానాస్పదంగా తిరిగిన నరసింహ అనే వ్యక్తిని విచారించారు జిల్లా ఎస్పీ.. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు నరసింహ.. తాను రైతు గానే పవన్ కల్యాణ్.. రైతుల సమావేశానికి వచ్చానని పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది.. కాగా, 50 మంది వైసీపీ నేతలకు రైతుల సమావేశానికి పాస్ లు ఇచ్చారట స్థానిక ఎమ్మెల్యే.. మొత్తంగా పవన్ పర్యటనలో అనుమానాస్పద కదలికలపై వైసీపీ కార్యకర్త నరసింహను ప్రశ్నించిన పోలీసులు.. అవసరమైతే మళ్లీ పిలుస్తామని నరసింహకు చెప్పినట్టుగా తెలుస్తోంది.. ఇక, తాను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి 50 సార్లు రక్తదానం చేశానని పోలీసుల విచారణలో నరసింహ తెలిపినట్టుగా తెలుస్తుంది..