
ఇటీవలి కాలంలో మలయాళ సినిమా ఇండస్ట్రీ వరుసగా కంటెంట్ బేస్డ్ హారర్–థ్రిల్లర్ చిత్రాలతో ప్యాన్–ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆ జాబితాలో ‘డీయస్ ఈరే’ కూడా ఒకటి. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ హీరోగా నటించగా.. హారర్ జానర్‌లో వచ్చిన ఈ సినిమా విడుదలయ్యే వరకు పెద్దగా అంచనాలు లేకపోయినా, రిలీజ్ తర్వాత మంచి టాక్ సంపాదించి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకుంది. ప్రణవ్ కెరీర్‌లో ఇది మరో హిట్‌గా నిలిచింది. సినిమా కథ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యేలా చేశాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో హారర్ జానర్ అభిమానులకు ఇది మంచి ట్రీట్ అయ్యింది. ఈ హిట్ తర్వాత సినిమా ఇతర భాషల్లో కూడా విడుదల కాగా, తెలుగులో మోస్తరు స్పందన అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి ప్లాట్‌ఫారమ్‌కి వస్తోంది.
Also Read : Krithi Shetty: ఒక నిమిషం లేట్.. కృతీ శెట్టీ జీవితాన్ని ఎలా మార్చేసిందో తెలుసా ?
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకోగా.. తాజాగా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. డిసెంబర్ 5 నుంచి ‘డీయస్ ఈరే’ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ రానుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. థియేటర్స్‌లో మల్టిపుల్ లాంగ్వేజ్‌ల్లో రిలీజ్ అయినప్పటికీ, ఓటిటి వెర్షన్ మాత్రం కేవలం మలయాళంలోనే స్ట్రీమ్ కానుందని హాట్‌స్టార్ టీమ్ స్పష్టం చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి ఇతర వెర్షన్‌లపై హాట్‌స్టార్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో పాన్–ఇండియా ప్రేక్షకులు కొంత నిరాశ చెందే అవకాశం ఉంది. తెలుగు ప్రేక్షకులైతే ఓటీటీలో తమ భాషలో ఈ సినిమాను చూడాలని ఆశ పడ్డాను కానీ ప్రస్తుతం ఆ అవకాశం పై స్పష్టత లేదు. కానీ ఓటిటిలో మల్టిపుల్ లాంగ్వేజ్‌లలో రిలీజ్ చేస్తే ఇంకా పెద్ద రీచ్ సంపాదించే అవకాశం ఉందని సినిమా పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు.