Election Commission: ఓటర్ల జాబితా సవరణకు 7 రోజులు పొడిగింపు..

Election Commission Extends Sir Form Submission Deadline To 7 Days

Election Commission: భారత ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రాబోయే ఎన్నికల దృష్ట్యా, ఓటర్ల జాబితాలో తమ పేర్లు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధరించుకోవడానికి ప్రజలకు మరింత సమయం కల్పిస్తూ 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రత్యేక ఓటర్ సవరణకు అవకాశం కల్పిస్తూ వారం రోజులు గడువును పొడిగించింది. ఈ గడువు పొడిగింపు అండమాన్- నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లకు వర్తిస్తుంది.

Read Also: Jagtial: సర్పంచ్‌ పోరుకు కన్నతల్లితోనే పోటీ.. నామినేషన్ దాఖలు చేసిన తల్లీకూతుళ్లు

సవరించిన ముఖ్య తేదీలు
* ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎన్నికల సంఘం కొత్త తేదీలను ప్రకటించింది.
* ఎన్యూమరేషన్ (ఓటర్ల లెక్కించే) కాలం: డిసెంబర్ 11, (గురువారం) వరకు పొడిగించింది.
* పోలింగ్ స్టేషన్లు హేతుబద్ధీకరణ/ పునర్వ్యవస్థీకరణ: డిసెంబర్ 11, (గురువారం) నాటికి పూర్తి చేయాలి..
* కంట్రోల్ టేబుల్ నవీకరణ, ముసాయిదా జాబితా తయారీ: డిసెంబర్ 12-15, 2025 (శుక్రవారం నుంచి సోమవారం).
* ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ: డిసెంబర్ 16, 2025 (మంగళవారం).
* క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలు గడువు: డిసెంబర్ 16, 2025 నుంచి జనవరి 15, 2026 (గురువారం) వరకు.
* నోటీసు దశ: డిసెంబర్ 16, 2025 నుంచి ఫిబ్రవరి 7, 2026 (శనివారం) వరకు.. ఈ సమయంలో ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్లు ఓటర్ జబితాలోని అభ్యంతరాలు, ఎన్యూమరేషన్ ఫారమ్‌లను ఏకకాలంలో పరిష్కరిస్తారు.

Read Also: Google Pixel 10 Price Drop: గూగుల్ పిక్సెల్ 10పై 14 వేల తగ్గింపు.. ఎగబడిన జనం, స్టాక్ ఓవర్!

పౌరులకు ముఖ్య సూచన
ఓటర్ల జాబితా ఖచ్చితమైనది. అలాగే, సమ్మిళితంగా ఉండేలా చూడాలనే ఎన్నికల సంఘం నిరంతర ప్రయత్నంలో భాగంగా SIRను తీసుకొచ్చింది. ఈ గడువు పొడిగింపు ముఖ్యంగా రాబోయే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని ఓటర్లు తమ వివరాలను సరిచూసుకోవడానికి, అభ్యంతరాలు దాఖలు చేయడానికి లేదా అవసరమైన దిద్దుబాట్లు చేసుకోవడానికి అదనపు సమయాన్ని కేటాయించింది. ఈసీ ప్రకటించిన 12 రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రజలు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. తద్వారా భవిష్యత్తు ఎన్నికలలో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోకుండా ఉంటారని ఎన్నికల అధికారులు వెల్లడించారు.