
Faf du Plessis: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన, అనుభవజ్ఞులలో ఒకరైన స్టార్ ప్లేయర్ ఈసారి వేలంలో పాల్గొనడం లేదు. ఇంతకీ ఆ స్టార్ ప్లేయర్ ఎవరని అనుకుంటున్నారా.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్. తాజాగా ఈ స్టార్ ప్లేయర్ 14 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈసారి ఐపీఎల్ వేలంలో తాను పాల్గొనబోనని డు ప్లెసిస్ ఒక ప్రకటన విడుదల చేశాడు. డిసెంబర్ 16న, 2026 ఐపీఎల్ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం జరగనున్న క్రమంలో ఈ ప్రకటన సర్వత్రా ఆసక్తిగా మారింది.
READ ALSO: Tiruvuru MLA: ఎమ్మెల్యే కొలికిపూడి కీలక వ్యాఖ్యలు.. అలా అనుకున్న వారిని తొక్కి నార తీస్తా..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ డు ప్లెసిస్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సంవత్సరం వేలంలో తాను పాల్గొనబోనని ప్రకటించాడు. డు ప్లెసిస్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు.. “ఐపీఎల్‌లో 14 సంవత్సరాల తర్వాత, నేను ఈ సంవత్సరం వేలంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాను. ఇది చాలా పెద్ద నిర్ణయం ” అని ఈ పోస్ట్‌లో రాసుకొచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన ఈ స్టార్ ప్లేయర్ గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగంగా ఉన్నాడు. కానీ ఈ ఏడాది వేలానికి ముందే ఈ ఫ్రాంచైజీ ఆయనను విడుదల చేసింది. దీని తర్వాత, ఈ 40 ఏళ్ల దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. “ఈ లీగ్ నా ప్రయాణంలో చాలా పెద్ద భాగం. ప్రపంచ స్థాయి సహచరులు, అద్భుతమైన ఫ్రాంచైజీ, ఆటపై చాలా మక్కువ కలిగిన అభిమానులు దొరకడం నాకు అదృష్టం” అని పేర్కొన్నారు.
READ ALSO: KL Rahul: ప్లేయింగ్-11 పై కెప్టెన్ కేఎల్ రాహుల్ కీలక ప్రకటన..