
స్మార్ట్ వాచ్ లు ట్రెండీగా మారాయి. యూత్ తో పాటు పెద్దవాళ్లు కూడా స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నారు. అవి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తాయి, ఫిట్నెస్ ట్రాకింగ్ చేస్తాయి, రోజువారీ పనుల్లో సహాయపడతాయి. మరి మీరు కూడా కొత్త స్మార్ట్ వాచ్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ పై క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో Fire-Boltt ONYX Smartwatch రూ. 1499కే వచ్చేస్తోంది.
Also Read:Imran Khan: “ఇమ్రాన్ ఖాన్ బతికి ఉన్నాడనే రుజువు లేదు”.. కుమారుడి సంచలన వ్యాఖ్యలు..
Fire-Boltt ONYX Smartwatchపై 92 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని అసలు ధర రూ. 21000. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 1499కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించి కొనుగోలు చేస్తే మరింత తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. ఈ వాచ్ స్టైల్, టెక్నాలజీల అద్భుతమైన మిశ్రమం. ధర తక్కువగా ఉండి, అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఈ గాడ్జెట్ ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. ఫైర్-బోల్ట్ ఓనిక్స్ డిజైన్ అట్రాక్ట్ చేస్తుంది. ఇది స్టీల్ బాడీతో తయారైంది, ఇది ప్రీమియం లుక్ ఇస్తుంది.
సర్క్యులర్ షేప్‌తో ఫ్లాట్ సర్ఫేస్ ఉంది, బ్లాక్, రోజ్ గోల్డ్, సిల్వర్ వంటి కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. బ్రాస్లెట్ డిజైన్‌తో కంఫర్టబుల్‌గా ధరించవచ్చు. IP67 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ కాబట్టి, డైలీ యూజ్‌లో ఎటువంటి సమస్య ఉండదు. ఈ స్మార్ట్‌వాచ్ 1.43-ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 36.3mm సైజ్‌తో, 466 x 466 పిక్సెల్స్ రెజల్యూషన్‌తో కూడిన అల్వే-ఆన్ డిస్ప్లే. ఔట్ఫిట్ ప్రకారం 130+ కస్టమైజబుల్ వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, 4GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ తో మ్యూజిక్, ఫోటోలు స్టోర్ చేయవచ్చు. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో ఇన్‌బిల్ట్ మైక్, స్పీకర్ ఉన్నాయి. బ్యాటరీ 380mAhతో 5 రోజుల వరకు వాడుకోవచ్చు. ఫుల్ చార్జ్ 2 గంటల్లో పూర్తవుతుంది.
హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 (బ్లడ్ ఆక్సిజన్) ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి రియల్-టైమ్ డేటా ఇస్తాయి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఫిట్నెస్ ఎంథూజియాస్ట్లకు 300+ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. మీ వర్కౌట్లను ట్రాక్ చేసి, గోల్స్ సెట్ చేయవచ్చు. వెదర్ అప్డేట్స్, AI వాయిస్ అసిస్టెంట్ వంటివి కూడా ఉన్నాయి.