Former Naxalite Murder: మాజీ నక్సలైట్ ప్రాణం తీసిన యూట్యూబ్ ఛానెల్ ఇంటర్య్వూ.. అసలేం జరిగింది..?

Former Naxalite Murdered Over Youtube Interview Rajanna Sircilla

Former Naxalite Murder: ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్య్వూ మాజీ నక్సలైట్ ప్రాణం తీసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గుట్టలో మాజీ నక్సలైట్‌ను దారుణ హత్య చేశాడు ఓ వ్యక్తి. తంగళ్లపల్లి (మం) గండిలచ్చపేటకు చెందిన బల్లెపు సిద్దయ్య అలియాస్ నర్సయ్య అనే మాజీ నక్సలైట్‌ను సంతోష్ అనే వ్యక్తి దారుణంగా హతమార్చాడు. నరసయ్యను హత్య చేసిన తరువాత జగిత్యాల పోలీసులు లొంగిపోయాడు సంతోష్.. ఈ హత్యకు ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూ కారణమైంది.. నర్సయ్య తాను అజ్ఞాతంలో(నక్షలైట్‌గా) ఉన్నప్పుడు సంతోష్ తండ్రి చంపినట్లు ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పేర్లతో సహా చెప్పడంతో తన తండ్రిని చంపినట్లుగా జగిత్యాల జిల్లాకు చెందిన సంతోష్ నిర్ధారణకు వచ్చాడు.. దీంతో ఆ మజీ నక్షలైట్‌ను ఎలాగైనా చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. పథకం ప్రకారం అగ్రహారం గుట్టలకు పిలిపించి దారుణంగా హతమార్చాడు.

READ MORE: Health Risks of Sitting:ఎక్కువ సేపు కదలకుండా కూర్చుంటున్నారా? అయితే జాగ్రత్త!